రోహిత్ దెబ్బకు 22 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
జయసూర్య అత్యధిక పరుగుల రికార్డు తెరమరుగు భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ 2019 వన్డే సీజన్ ను అత్యంత విజయవంతంగా..సరికొత్త ప్రపంచ రికార్డుతో ముగించాడు. కటక్ బారాబటీ స్టేడియం వేదికగా విండీస్ తో ముగిసిన ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా…వన్డే క్రికెట్లో ఓపెనర్ గా శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య రెండుదశాబ్దాల క్రితం నెలకొల్పిన ప్రపంచ రికార్డును రోహిత్ అధిగమించాడు. ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ గా […]
- జయసూర్య అత్యధిక పరుగుల రికార్డు తెరమరుగు
భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ 2019 వన్డే సీజన్ ను అత్యంత విజయవంతంగా..సరికొత్త ప్రపంచ రికార్డుతో ముగించాడు.
కటక్ బారాబటీ స్టేడియం వేదికగా విండీస్ తో ముగిసిన ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా…వన్డే క్రికెట్లో ఓపెనర్ గా శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య రెండుదశాబ్దాల క్రితం నెలకొల్పిన ప్రపంచ రికార్డును రోహిత్ అధిగమించాడు.
ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. 1997 సీజన్లో సనత్ జయసూర్య 2వేల 387 పరుగులు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. గత 22 సంవత్సరాలుగా ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.
అయితే …కటక్ వన్డేలో రోహిత్ వ్యక్తిగతంగా 9 పరుగులు సాధించడం ద్వారా జయసూర్య రికార్డును తెరమరుగు చేశాడు.
రోహిత్ 2019 సీజన్లో మొత్తం మూడుఫార్మాట్లలో ఆడిన 47 ఇన్నింగ్స్ లో 2442 పరుగులతో 52.86 కు పైగా సగటుతో నిలిచాడు.ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఏడు వన్డే శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ మాత్రమే.
రోహిత్ మరో ప్రపంచ రికార్డ్ మిస్…
ఓ క్యాలెండర్ ఇయర్ లో 1500 పరుగులు సాధించిన తొలి ఆటగాడి రికార్డును రోహిత్ చేజార్చుకొన్నాడు. సీజన్ ఆఖరి ఇన్నింగ్స్ లో 73 పరుగులు చేయాల్సిన రోహిత్ కేవలం 63 పరుగులకే అవుట్ కావడంతో రెండో ప్రపంచ రికార్డును సొంతం చేసుకోలేకపోయాడు. వన్డే ఫార్మాట్లో 1490 పరుగులు మాత్రమే చేయగలిగాడు.