విశాఖను రాజధానిగా మేం ఒప్పుకోం " టీడీపీ నేత జేసీ పవన్
మూడు రాజధానుల ఆలోచనను తాము ఒప్పుకోబోమన్నారు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, టీడీపీ నేత జేసీ పవన్ కుమార్ రెడ్డి. విశాఖను పరిపాలన రాజధానిగా తాము అంగీకరించబోమన్నారు. పార్టీ నిర్ణయమైనా, వ్యక్తిగత నిర్ణయమైనా లాజిక్ ఇదేనని వ్యాఖ్యానించారు. ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… విజయవాడ చాలా అందమైన నగరమని కితాబిచ్చారు. విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టుకు కేంద్రం అనుమతి ఇవ్వదని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టును వ్యతిరేకిస్తే ఆ […]
మూడు రాజధానుల ఆలోచనను తాము ఒప్పుకోబోమన్నారు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, టీడీపీ నేత జేసీ పవన్ కుమార్ రెడ్డి. విశాఖను పరిపాలన రాజధానిగా తాము అంగీకరించబోమన్నారు. పార్టీ నిర్ణయమైనా, వ్యక్తిగత నిర్ణయమైనా లాజిక్ ఇదేనని వ్యాఖ్యానించారు.
ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… విజయవాడ చాలా అందమైన నగరమని కితాబిచ్చారు. విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టుకు కేంద్రం అనుమతి ఇవ్వదని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టును వ్యతిరేకిస్తే ఆ ప్రాంతాల్లో టీడీపీ నష్టపోతోంది కదా అన్న ప్రశ్నకు… మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే వైసీపీ కూడా గుంటూరు, కృష్ణాల్లో నష్టపోతుందని జేసీ పవన్ వ్యాఖ్యానించారు.
అమరావతి ఒక కులానికి రాజధాని అంటూ తాను అంగీకరించబోనని జేసీ పవన్ కుమార్ రెడ్డి చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక వల్లే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. ఏపీలో రెడ్ల పాలన సాగుతోందన్న విమర్శపై స్పందించిన జేసీ పవన్ కుమార్ రెడ్డి… ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత అసంతృప్తితో ఉన్నది వైసీపీ కార్యకర్తలు, రెడ్డి కులస్తులేనని చెప్పారు.
వైసీపీని గెలిపించడం కోసం వారంతా చాలా కష్టపడ్డారని చెప్పారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం వారికి ఏమీ చేయలేదన్నారు. రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ తమకు జగన్ ఏమాత్రం పెద్దపీట వేయలేదన్న అసంతృప్తితో రెడ్డి సామాజికవర్గం వారు ఉన్నారన్నారు.
రామోజీ రావు వియ్యంకుడికి చెందిన నవయుగ కంపెనీ పట్ల జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని.. ఆ కంపెనీని భూస్థాపితం చేశారని జేసీ పవన్ కుమార్ రెడ్డి ఆవేదన చెందారు.