ధోనీ క్రికెట్ కు 15 సంవత్సరాలు
2004 డిసెంబర్ 23న తొలి అంతర్జాతీయ మ్యాచ్ భారత్ కు 2 ప్రపంచకప్ లు అందించిన జార్ఖండ్ డైనమైట్ జార్ఖండ్ డైనమైట్ , భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి నేటితో 15 సంవత్సరాలయ్యాయి. భారత క్రికెట్ కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా మొత్తం మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని సిరీస్ విజయాలు అందించిన ధోనీకి […]
- 2004 డిసెంబర్ 23న తొలి అంతర్జాతీయ మ్యాచ్
- భారత్ కు 2 ప్రపంచకప్ లు అందించిన జార్ఖండ్ డైనమైట్
జార్ఖండ్ డైనమైట్ , భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి నేటితో 15 సంవత్సరాలయ్యాయి.
భారత క్రికెట్ కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా మొత్తం మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని సిరీస్ విజయాలు అందించిన ధోనీకి వన్డే ప్రపంచకప్, టీ-20 ప్రపంచకప్ లు అందించడంతో పాటు…భారత జట్టును టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిపిన ఘనత ఉంది.
క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం లేని జార్ఖండ్ రాష్ట్ర్లం నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన ధోనీ 2004 డిసెంబర్ 23న చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా తన ఆరంగేట్రం వన్డే మ్యాచ్ ఆడాడు.
2005 డిసెంబర్ 2న చెన్నై వేదికగా శ్రీలంకపై తొలిటెస్ట్. 2006 డిసెంబర్ 1న జోహెన్స్ బర్గ్ వేదికగా సౌతాఫ్రికాపై తొలి టీ-20 ఆడిన ధోనీ 14 సంవత్సరాల తన అంతర్జాతీయ కెరియర్ లో ఎన్నో అసాధారణ రికార్డులు నమోదు చేశాడు.
90 టెస్టుల్లో 6 సెంచరీలు, 4వేల876 పరుగులు, 350 వన్డేల్లో 10 సెంచరీలు, 10 వేల 773 పరుగులు, 98 టీ-20 ల్లో 2 హా్ఫ్ సెంచరీలు, 1617 పరుగులు సాధించడంతో పాటు అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.
ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ పలికిన ధోనీ వన్డే ప్రపంచకప్ తర్వాత విరామం తీసుకొన్నాడు. ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ తో ధోనీ తన కెరియర్ కు పూర్తిగా ముగింపు పలికే అవకాశం ఉంది.
ఐపీఎల్ లోనూ తన ముద్ర చూపిన ధోనీలాంటి మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ భారత క్రికెట్లోకి రావాలంటే మరెంత కాలం వేచిచూడాలో మరి.