Telugu Global
National

ఏపీ రాజధానిగా విశాఖ... తెలుగు సినీ నిర్మాతలు సంతోషం...

విశాఖపట్నంను ఏపీ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతోషంలో మునిగిపోయిందట… తెలుగు సినిమా నిర్మాతలు దీనిపై హర్షం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 70 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి విశాఖపట్నంతో అవినాభావ సంబంధం ఉంది. గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలోనే వందలాది తెలుగు సినిమాలు తెరకెక్కాయి. ఇక్కడి భౌగోళిక స్వరూపం.. పచ్చదనం, గోదావరి నది ప్రవాహం వరి పొలాలు, ప్రకృతి అందాలను ఎంతో మంది దర్శకులు తమ సినిమాల్లో చూపించారు. […]

ఏపీ రాజధానిగా విశాఖ... తెలుగు సినీ నిర్మాతలు సంతోషం...
X

విశాఖపట్నంను ఏపీ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతోషంలో మునిగిపోయిందట… తెలుగు సినిమా నిర్మాతలు దీనిపై హర్షం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

70 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి విశాఖపట్నంతో అవినాభావ సంబంధం ఉంది. గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలోనే వందలాది తెలుగు సినిమాలు తెరకెక్కాయి. ఇక్కడి భౌగోళిక స్వరూపం.. పచ్చదనం, గోదావరి నది ప్రవాహం వరి పొలాలు, ప్రకృతి అందాలను ఎంతో మంది దర్శకులు తమ సినిమాల్లో చూపించారు.

ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కూడా విశాఖ మన్యంలోనే రూపుదిద్దుకుంటుండడం విశేషం. దర్శకుడు వంశీ తీసిన సినిమాలైతే ఫక్తు ఈ విశాఖ, గోదావరి జిల్లాల్లోనే తీసేవారు.

నిజానికి ఏపీ ఏర్పడినప్పుడు తమిళనాడుకు చెన్నైలాగా…. ఏపీకి విశాఖ రాజధానిగా మారడం ఖాయమని అంతా భావించారు. విజయవాడను మరో ముధురై, కోయంబత్తూరులాగా చేస్తారని.. విశాఖను రాజధాని చేస్తారని భావించారు. అప్పటికే అభివృద్ధి చెందిన విశాఖే బెస్ట్ ఆప్షన్ అనుకున్నా… చంద్రబాబు మాత్రం తుళ్లూరులో అమరావతిని ఏర్పాటు చేసి తెలుగు సినిమా పరిశ్రమ ఆశలపై నీళ్లు చల్లారు.

ఇప్పటికే వైజాగ్ లో సినిమా ఇండస్ట్రీ పెద్దలు పెద్ద ఎత్తున భూములు కొని ఉన్నారు. రామానాయుడు అయితే ఒక స్టూడియోనే కట్టారు. కానీ దాన్ని వాడడం లేదు. ఇప్పుడు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించడంతో సినిమా నిర్మాతల పంట పండింది. వారి భూములకు ధరలు వస్తాయి. అలాగే సినిమా ఇండస్ట్రీని విశాఖకు విస్తరించేందుకు వారంతా రెడీగా ఉన్నారట.

First Published:  23 Dec 2019 3:08 PM IST
Next Story