Telugu Global
NEWS

రాజధాని రైతుల ధర్నాల్లో ప్రత్యేక సదుపాయాలు.... సోషల్ మీడియాలో చర్చ

సచివాలయం విశాఖపట్నానికి, హైకోర్టును రాయలసీమకు తరలించడానికి వీల్లేదంటూ రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. మీడియా వీరి చుట్టూ మోహరించింది. క్షణక్షణం అప్‌డేట్ ఇవ్వడంతోపాటు ఆందోళన చేస్తున్న వారికి కొందరు జర్నలిస్టులు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే రైతుల ధర్నాల్లో ప్రత్యేక సదుపాయాలపైనా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన రైతుల ధర్నాలు ఏలాంటి సదుపాయాలు లేకుండా, కనీసం సరైన ఆహారం కూడా లేని పరిస్థితుల్లో సాగాయి. కానీ అమరావతి రైతుల ధర్నాలు మాత్రం అందుకు భిన్నంగా […]

రాజధాని రైతుల ధర్నాల్లో ప్రత్యేక సదుపాయాలు.... సోషల్ మీడియాలో చర్చ
X

సచివాలయం విశాఖపట్నానికి, హైకోర్టును రాయలసీమకు తరలించడానికి వీల్లేదంటూ రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. మీడియా వీరి చుట్టూ మోహరించింది. క్షణక్షణం అప్‌డేట్ ఇవ్వడంతోపాటు ఆందోళన చేస్తున్న వారికి కొందరు జర్నలిస్టులు దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

అయితే రైతుల ధర్నాల్లో ప్రత్యేక సదుపాయాలపైనా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన రైతుల ధర్నాలు ఏలాంటి సదుపాయాలు లేకుండా, కనీసం సరైన ఆహారం కూడా లేని పరిస్థితుల్లో సాగాయి. కానీ అమరావతి రైతుల ధర్నాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

ఈ సదుపాయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రాజధాని రైతులు రోడ్డెక్కారు అని పత్రికలు రాస్తున్నా… ధర్నాలు చేస్తున్న వారు మాత్రం టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తున్నారు. పైగా కింద మట్టి తగలకుండా గ్రీన్ కార్పెట్లు పరుచుకుని ఆందోళనకు కూర్చున్నారు. దాతలు పోటీపడి భోజనాలు సమకూరుస్తున్నారు.

ధర్నాలకు వచ్చిన వారంతా చాలా లగ్జరీ డ్రెసింగ్‌తో కనిపించడం కూడా సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతోంది. అందరి దగ్గర ఐఫోన్లు, విలువైన వస్తువులు, ఖరీదైన వస్త్రధారణ చూసి అమరావతి రైతులు చాలా ధనవంతులే అన్న భావన వ్యక్తమవుతోంది. ధర్నాల్లో పాల్గొంటున్న యువత శిబిరాల వద్దకు కార్లు, ఎన్‌ఫీల్డ్ బైకులతో వస్తున్నారు. యూత్ అంతా బ్రాడెండ్ బట్టలు ధరించి సినిమా హీరోల తరహాలో కనిపిస్తున్నారు.

ధర్నాల్లో పాల్గొంటున్న వ్యక్తులు, మహిళల భాష మరీ దారుణంగా ఉండడం కూడా వారిపై సానుభూతిని తీసుకురావడం లేదు. పెద్దింటి మహిళల్లా కనిపించే వారు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం గురించి బూతులు మాట్లాడడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

మీడియా సంస్థలు కూడా ప్రభుత్వంపైనా, జగన్‌పై ఘాటు పదాలతో దుమ్మెత్తిపోసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి… వాటినే ప్రసారం చేస్తున్నాయి. వారి మాటలు చూస్తుంటే బాధతో మాట్లాడుతున్నట్టుగా లేదు… అహంకారం, తామే అందరి కంటే గొప్ప, అన్ని సదుపాయాలు మా ప్రాంతంలోనే ఉండాలన్న ఆధిపత్య, అహంకార ధోరణి కనిపిస్తోందని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తూ…. మండిపడుతున్నారు.

ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని, రాయలసీమలో హైకోర్టును…. అమరావతిలోని రైతులు, టీడీపీ అభిమానులు ఇంత బహిరంగంగా వ్యతిరేకిస్తురంటే వారి ఆధిపత్య ధోరణిని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. వీరి ధోరణి ఇప్పుడే ఇలా ఉంటే ఒకవేళ అమరావతిలోనే అన్ని పెట్టి, లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన తర్వాత మిగిలిన ప్రాంతాల వారిని పురుగుల్లా చూడరన్న గ్యారెంటీ ఏమిటి? అని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  23 Dec 2019 10:31 AM IST
Next Story