కటక్ లో నేడే వన్డే సిరీస్ ఆఖరాట
సిరీస్ నీదా నాదా అంటున్న భారత్, విండీస్ ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ లోని మొదటి రెండువన్డేల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో కటక్ బారాబటీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఆఖరి వన్డే నిర్ణయాత్మకంగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టే సిరీస్ విజేత కాగలుగుతుంది. సిరీస్ వైపే రెండుజట్ల చూపు… చెన్నై వేదికగా జరిగిన […]
- సిరీస్ నీదా నాదా అంటున్న భారత్, విండీస్
ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ లోని మొదటి రెండువన్డేల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో కటక్ బారాబటీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఆఖరి వన్డే నిర్ణయాత్మకంగా మారింది.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టే సిరీస్ విజేత కాగలుగుతుంది.
సిరీస్ వైపే రెండుజట్ల చూపు…
చెన్నై వేదికగా జరిగిన తొలివన్డేలో విండీస్ ఓపెనర్ హోప్, హేట్ మేయర్ స్ట్ర్రోక్ ఫుల్ సెంచరీలతో తమజట్టుకు 8 వికెట్ల అలవోక విజయం అందించారు.
ఆ తర్వాత విశాఖ వేదికగా జరిగిన రెండోవన్డేలో నెగ్గితీరాల్సిన భారత్ విశ్వరూపమే ప్రదర్శించింది. ఓపెనర్లు రాహుల్, రోహిత్ ధూమ్ ధామ్ సెంచరీలతో పాటు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంతో 388 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన భారత్ భారీవిజయంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది.
స్లోవికెట్ సవాల్…..
మొదటి రెండు వన్డేలకు భిన్నమైన వికెట్ మీద… కటక్ వేదికగా జరుగనున్న ఆఖరి వన్డేలో బ్యాట్స్ మన్ సహనానికి పరీక్షగా నిలిచే స్లోవికెట్ పైన రెండుజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.
280కి పైగా పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. మొదటి రెండు వన్డేల్లో టాస్ ఓడి మిశ్రమఫలితాలు సాధించిన భారత్, టాస్ నెగ్గినా ఒక్కో గలుపు, ఓటమి రికార్డులతో నిలిచిన విండీస్ జట్లు…ఆఖరాటలో టాస్ ప్రమేయం లేకుండా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాయి.
బారాబటీ పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ దిగిన జట్టుకే పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేజింగ్ కు దిగిన జట్టు పరుగుల కోసం శ్రమించక తప్పదు.
ఇటు, అటూ హిట్టర్లే కీలకం…
భారత ఓపెనింగ్ జోడీతో పాటు నాలుగో నంబర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, హిట్టర్ రిషభ్ పంత్ దూకుడు మీదున్నారు. అయితే కెప్టెన్ కొహ్లీ విశాఖ వన్డేలో డకౌటైనా…కటక్ లో సెంచరీ బాదడం ద్వారా ఆలోటును భర్తీ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.
మరోవైపు విండీస్ ఓపెనర్ హోప్, హెట్ మేయర్, నికోలస్ పూరన్ కళ్లు చెదిరే ఫామ్ లో ఉన్నా..మరో ఓపెనర్ ఇవిన్ లూయిస్, కెప్టెన్ పోలార్డ్ సైతం భారీస్కోర్లకు గురిపెట్టారు.
రెండోవన్డేలో అత్యుత్తమంగా రాణించిన భారత బౌలింగ్ ఎటాక్ ఆఖరాటలోనూ అదేజోరు కొనసాగించగలిగితే కరీబియన్ టాపార్డర్ కు కష్టాలు తప్పవు.
ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో…
రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే సమఉజ్జీలుగా ఉన్నాయి. విశాఖ వన్డే వరకూ రెండుజట్లు 132మ్యాచ్ ల్లో తలపడితే చెరో 62 విజయాలున్నాయి. మరో రెండుమ్యాచ్ లు టైగా ముగిస్తే… మూడు వన్డేలు ఫలితం తేలకుండానే ముగిసాయి.
2019 క్రికెట్ సీజన్ ను సిరీస్ విజయంతో ముగించాలన్న లక్ష్యాన్ని ఏ జట్టు సాధించగలదన్నదే ఇక్కడి అసలుపాయింట్.