రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఫోన్లు ....
రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం వివాదాలు రేపడం చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న అలవాటేనని వైసీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. చాలాకాలంగా కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని… ఆ అసమానతలు తొలగించే ఉద్దేశంతోనే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న తరహాలోనే… రాష్ట్రం మొత్తం ఆందోళనలు వ్యాపించేలా చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలు చేయాల్సిందిగా ఫోన్లు చేసి చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సీ […]
రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం వివాదాలు రేపడం చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న అలవాటేనని వైసీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. చాలాకాలంగా కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని… ఆ అసమానతలు తొలగించే ఉద్దేశంతోనే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.
రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న తరహాలోనే… రాష్ట్రం మొత్తం ఆందోళనలు వ్యాపించేలా చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలు చేయాల్సిందిగా ఫోన్లు చేసి చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సీ రామచంద్రయ్య చెప్పారు. ఒక కృత్తిమ ఉద్యమాన్ని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
13 జిల్లాల చిన్న రాష్ట్రాన్ని దక్షిణాఫిక్రాతో పోల్చడం ఏమిటి అని చెబుతున్న టీడీపీ నేతలు… మరి 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ప్రపంచస్థాయి రాజధాని కడతానని చంద్రబాబు ఎందుకు చెప్పారో సమాధానం చెప్పాలన్నారు. వెనుక బడిన కరువు ప్రాంతాల నుంచి కూడా పన్నులు తీసుకెళ్లి అమరావతిలో లక్షల కోట్లు కుమ్మరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతున్న మేధావులు దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అమరావతిలో రాజధాని రైతుల ఆందోళన వెనుక టీడీపీ నేతల ప్రమేయం లేదని చెప్పగలరా అని రామచంద్రయ్య ప్రశ్నించారు.
రాష్ట్రానికి సంబంధించిన లక్షల కోట్లు తీసుకెళ్లి అమరావతిలో కుమ్మరించి… సొంత మనుషులకు, బినామీలకు మంచి చేయాలని చంద్రబాబు కుట్ర చేశారన్నారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని… ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని… అందుకు కొంత సమయం ఇవ్వాలన్నారు.