Telugu Global
NEWS

కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విజయశాంతి

కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి తాజాగా సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలన తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో సామాన్యులు రోడ్డు మీదకు వచ్చి నడిచినా డబ్బులు వసూలు చేసేలా ఉన్నారంటూ.. పెరుగుతున్న ధరలపై విజయశాంతి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నడపలేమంటూ కేసీఆర్ చేతులెత్తేస్తారని.. దీన్ని కేసీఆర్ బంగారు తెలంగాణ అంటారేమోనని విజయశాంతి నిప్పులు చెరిగారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయశాంతి ప్రస్తుతం యాక్టివ్ […]

కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విజయశాంతి
X

కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి తాజాగా సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలన తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో సామాన్యులు రోడ్డు మీదకు వచ్చి నడిచినా డబ్బులు వసూలు చేసేలా ఉన్నారంటూ.. పెరుగుతున్న ధరలపై విజయశాంతి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నడపలేమంటూ కేసీఆర్ చేతులెత్తేస్తారని.. దీన్ని కేసీఆర్ బంగారు తెలంగాణ అంటారేమోనని విజయశాంతి నిప్పులు చెరిగారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయశాంతి ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా విజయశాంతి ఫేస్ బుక్ లో స్పందిస్తూ ఇప్పటికే మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచారని.. నిన్న పాల ధరలు పెంచారని.. త్వరలోనే కరెంట్ చార్జీలు పెంచబోతున్నారంటూ కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పేరుతో కేసీఆర్ గారడీ చేశారని… కేసీఆర్ కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు ఇప్పుడు తెలంగాణలో సామన్యుల నడ్డి విరుస్తున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితిలో కేసీఆర్ దొరగారు ఉన్నారని మండిపడ్డారు. అడిగితే ప్రతిపక్షాలపై కేసులు పెడుతానని కేసీఆర్ బెదిరిస్తున్నారని, టీఆర్ఎస్ పాలన తెలంగాణకు శాపం అంటూ విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అభివృద్ధి పేరుతో ఇంతకాలం గారడీ చేసిన సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో ఆర్టిసి సమ్మెను కారణంగా చూపించి… ఆర్టీసీ చార్జీలు…

Posted by Vijayashanthi on Friday, 20 December 2019

First Published:  21 Dec 2019 3:45 AM GMT
Next Story