ఏపీకి ఇక 25 జిల్లాలు.... వైసీపీ సర్కారు సంచలనం
ఏపీకి ఇప్పటికే మూడు రాజధానులు అవసరం అని ప్రకటించిన సీఎం జగన్ త్వరలోనే 25 జిల్లాలుగా ఏపీని విభజించబోతున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. విశాఖ పట్నంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం చేసిన ఈ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు పొల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ […]
ఏపీకి ఇప్పటికే మూడు రాజధానులు అవసరం అని ప్రకటించిన సీఎం జగన్ త్వరలోనే 25 జిల్లాలుగా ఏపీని విభజించబోతున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
విశాఖ పట్నంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం చేసిన ఈ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు పొల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణతో అభివృద్ధి చేస్తుందని.. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ సంకల్పం అని ఆయన చెప్పారు.
విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేసిన జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.