కింగ్స్ పంజాబ్ కెప్టెన్ గా రాహుల్
యువ ఓపెనర్ కు మొహాలీ పగ్గాలు భారత యువఓపెనర్ కెఎల్ రాహుల్ చేతికి…. 2020 ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ పంజాబ్ జట్టు పగ్గాలను ఇచ్చారు. గతంలో కెప్టెన్ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోడంతో…11 కోట్ల రూపాయల వేలంధరతో 2018 సీజన్ లో మొహాలీ ఫ్రాంచైజీ సొంతమైన రాహుల్ కేవలం రెండుసీజన్ ల అనుభవంతోనే నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అనీల్ కుంబ్లే మెంటార్ గా ఉన్న పంజాబ్ జట్టులో గ్లెన్ మాక్స్ వెల్, […]
- యువ ఓపెనర్ కు మొహాలీ పగ్గాలు
భారత యువఓపెనర్ కెఎల్ రాహుల్ చేతికి…. 2020 ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ పంజాబ్ జట్టు పగ్గాలను ఇచ్చారు. గతంలో కెప్టెన్ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోడంతో…11 కోట్ల రూపాయల వేలంధరతో 2018 సీజన్ లో మొహాలీ ఫ్రాంచైజీ సొంతమైన రాహుల్ కేవలం రెండుసీజన్ ల అనుభవంతోనే నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
అనీల్ కుంబ్లే మెంటార్ గా ఉన్న పంజాబ్ జట్టులో గ్లెన్ మాక్స్ వెల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, షెల్డన్ కోట్రెల్, మహ్మద్ షమీ, మయాంక్ అగర్వాల్ లాంటి మేటి ఆటగాళ్లున్నారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యంత సమతూకంతో ఉన్న కింగ్స్ పంజాబ్ సరికొత్త సీజన్లో విజేతగా నిలవాలన్న పట్టుదలతో జట్టును తీర్చిదిద్దుకొంది.
అనీల్ కుంబ్లే నేతృత్వం, రాహుల్ నాయకత్వం పంజాబ్ జట్టును 2020 లీగ్ లో కింగ్ గా నిలుపుతుందా… వేచి చూడాల్సిందే.