'ప్రతి రోజూ పండగే' సినిమా రివ్యూ
రివ్యూ : ప్రతి రోరోజూ పండగే రేటింగ్ : 2.5/5 తారాగణం : సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, ప్రభ, నరేష్, విజయకుమార్, మురళి శర్మ తదితరులు సంగీతం: ఎస్ ఎస్ థమన్ నిర్మాత : బన్నీ వాస్ దర్శకత్వం : మారుతి దాసరి వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి తేజ్ ‘చిత్రలహరి’ అనే సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తాజాగా ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో […]
రివ్యూ : ప్రతి రోరోజూ పండగే
రేటింగ్ : 2.5/5
తారాగణం : సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, ప్రభ, నరేష్, విజయకుమార్, మురళి శర్మ తదితరులు
సంగీతం: ఎస్ ఎస్ థమన్
నిర్మాత : బన్నీ వాస్
దర్శకత్వం : మారుతి దాసరి
వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి తేజ్ ‘చిత్రలహరి’ అనే సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తాజాగా ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజూ పండగే’ అనే సినిమాలో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ మెగా హీరో. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం గా టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇవాళ అనగా డిసెంబర్ 20న విడుదలైంది.
కథ:
రఘురామయ్య (సత్యరాజ్) రాజమండ్రిలో నివసిస్తూ ఉంటాడు. తన కుటుంబ సభ్యులందరూ ఫారెన్ లో ఉంటారు. రఘురామయ్య కి లంగ్ క్యాన్సర్ ఆఖరి స్టేజ్ లో ఉందని, 5 వారాల కంటే అతను బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తారు. దీంతో ఆఖరి రోజుల్లో తన కుటుంబ సభ్యులతో గడపాలన్న ఉద్దేశంతో తన పిల్లల్ని ఇంటికి పిలుస్తాడు. కానీ తండ్రి కంటే ఉద్యోగాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అతని పిల్లలు ఏదో ఒక కారణం చెబుతూ రావడం కుదరదని తేల్చి చెప్తారు. కానీ రఘురామయ్య మనవడైన (సాయి ధరమ్ తేజ్) మాత్రం తాత గారి కోసం రాజమండ్రి వస్తాడు. ఆఖరి రోజుల్లో రఘురామయ్య ని సాయి ధరమ్ తేజ్ ఎలా సంతోష పెట్టాడు? మిగతా కుటుంబ సభ్యులకి ఎలా గుణపాఠం చెప్పాడు? అనేది మిగతా కథ.
నటీనటులు:
మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి ఫుల్ లెంత్ కామెడీ రోల్ దక్కింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. తన నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది.
రాశికన్నా కేవలం తన అందంతోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. సుప్రీమ్ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమాలో ఆమెకు కామెడీ టచ్ ఉన్న పాత్ర లభించింది.
సత్య రాజ్, రావు రమేష్ మధ్య సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. అంతేకాక ముఖ్యంగా సత్యరాజ్ నటన సినిమాకి మరింత బాగా హెల్ప్ అయింది. నరేష్ మరియు ప్రభ కూడా చాలా సహజంగా నటించారు. విజయ్ కుమార్, మురళి శర్మ కూడా తమ నటనతో మెప్పించారు.
సాంకేతిక వర్గం:
బలమైన కథ లేకపోయినప్పటికీ మారుతి తన మార్క్ కామెడీ మరియు ఎంటర్ టైన్ మెంట్ తో సినిమాని చాలా బాగా నడిపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మారుతి మార్క్ కామెడీ సన్నివేశాలు చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఒక చిన్న రొటీన్ కథను తీసుకున్న దర్శకుడు కామెడీ, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ మరియు సెంటిమెంట్ వంటి కమర్షియల్ ఎలిమెంట్ లను కూడా జత చేసి చాలా బాగా ప్రజెంట్ చేశారు అని చెప్పుకోవచ్చు.
జిఏ 2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అయింది. పాటలు సంగతి పక్కన పెడితే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. జయకుమార్ అందించిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా పరవాలేదనిపిస్తుంది.
బలాలు:
ఫస్ట్ హాఫ్, నటీనటులు, ఎంటర్ టైన్ మెంట్, కామెడీ సన్నివేశాలు
బలహీనతలు:
సెకండ్ హాఫ్, ఎమోషనల్ సన్నివేశాలు
చివరి మాట:
కథ వినడానికి కొంచెం ఎమోషనల్ గా అనిపించినప్పటికీ దర్శకుడు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కి పెద్దపీట వేశారని చెప్పచ్చు. కథ బలంగా లేకపోయినా చాలావరకు కామెడీ సన్నివేశాలు బాగా వర్క్ అవడంతో సినిమా పర్వాలేదనిపించింది.
ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం కామెడీ మరియు రొమాన్స్ తో నిండి ఉంటుంది. ఇంటర్వల్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే మొదట బాగానే అనిపించినప్పటికీ ప్రీ క్లైమాక్స్ సమయంలో మాత్రం ఎమోషన్స్ భారీగా ఉండటంతో కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కథ కి బాగా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ డోస్ కొంచెం ఎక్కువ అవ్వడం… కొన్ని వర్గాల ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. నటీనటులు మరియు ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. చివరిగా ‘ప్రతి రోజు పండగే’ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్.
బాటమ్ లైన్:
‘ప్రతి రోజు పండగే’ కేవలం ఫ్యామిలీ ప్రేక్షకులకి మాత్రమే కనెక్ట్ అయ్యే ఎంటర్ టైన్ మెంట్ సినిమా.