Telugu Global
NEWS

అమరావతిలో లక్షల కోట్లు పెట్టే పరిస్థితి లేదు... జగన్‌ నిర్ణయాన్ని ధిక్కరించే ప్రసక్తే లేదు...

రాజధాని విషయంలో తమ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాను చేసిన మాటలకు తల, తోక తీసేసి కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని.. అవి కూడా రాష్ట్రంలోనే ఉన్నాయని.. కాబట్టి వాటి అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి జగన్‌తోనే వచ్చానని… పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు. అన్ని పెట్టుబడులు హైదరాబాద్‌లో పెట్టడం […]

అమరావతిలో లక్షల కోట్లు పెట్టే పరిస్థితి లేదు... జగన్‌ నిర్ణయాన్ని ధిక్కరించే ప్రసక్తే లేదు...
X

రాజధాని విషయంలో తమ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాను చేసిన మాటలకు తల, తోక తీసేసి కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయన్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని.. అవి కూడా రాష్ట్రంలోనే ఉన్నాయని.. కాబట్టి వాటి అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి జగన్‌తోనే వచ్చానని… పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు.

అన్ని పెట్టుబడులు హైదరాబాద్‌లో పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందన్నారు. ఇప్పుడు అదే పొరపాటు నూతన రాష్ట్రంలో జరగకూడదన్నారు. అభివృద్ది ఒకే చోట కేంద్రీకరించడం వల్ల జరిగిన నష్టం నుంచి గుణపాఠం నేర్చుకుని అభివృద్ధిని వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ అదే చెప్పిందని… జగన్‌ ఆలోచన కూడా అదేనన్నారు.

మూడు ప్రాంతాల్లో మూడు వ్యవస్థల ఏర్పాటు ఆలోచనను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారు కూడా మనవారేనని ఆప్రాంతాలను కూడా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో రాజధాని రావడానికి ముందే టీడీపీ నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ద్వారా నాలుగు వేల ఎకరాలకు పైగా కొనుగోలు చేశారన్నారు.

లంక భూముల పేరుతో ప్లాట్లు తీసుకోవడం, టీడీపీ నేతల భూముల వద్దే రింగ్ రోడ్డు వెళ్లాలా… రకరకాలుగా టీడీపీ నేతలు వారి భూముల విలువ పెంచుకునేందుకు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. అమరావతి ప్రాంతంలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా చేశారన్నారు. మూడు లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రం … అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం సాధ్యమయ్యే పనికాదన్నారు.

ఈ డబ్బుతో సాగు, తాగు నీరు ప్రాజెక్టులను నిర్మించుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. జగన్ చెప్పినట్టుగానే పరిపాలన రాజధాని విశాఖలో, హైకోర్టు కర్నూలులో, లేజిస్లేటివ్ కేపిట‌ల్‌ అమరావతిలో ఉంటాయని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న కూడా ఇదే విషయాలు తాను చెప్పానని.. కానీ కొన్ని మీడియా సంస్థలు తన మాటలకు సంబంధించి తలతోక తీసేసి వక్రీకరించాయన్నారు.

10 ఏళ్లుగా జగన్‌తోనే ఉన్నానని, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రసక్తే ఉండదన్నారు. అభివృద్ధి అన్నది మూడు ప్రాంతాలకు అందాలని మనస్పూర్తిగా తాను కోరుకుంటున్నానని చెప్పారు. లక్షల కోట్లు తీసుకెళ్లి అమరావతితో పెడితే మిగిలిన రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేసేందుకు డబ్బులు ఉండవన్నారు.

జగన్‌ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలంతా స్వాగతిస్తున్నారని… కేవలం అమరావతిలో భూములు ఇచ్చిన కొందరు మాత్రమే ఆందోళన చేస్తున్నారని.. వారి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.

First Published:  20 Dec 2019 8:38 AM IST
Next Story