చంద్రబాబుకు బాధ ఉండవచ్చు... కానీ విశాఖను అందరూ స్వాగతిస్తున్నారు...
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మరోసారి తెలుగుదేశం వైఖరిని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధానిని చేయడాన్ని టీడీపీ వ్యతిరేకించడాన్ని గంటా తప్పుపట్టారు. రాజధానిగా అమరావతిని చంద్రబాబు ఎంపిక చేశారు కాబట్టి… ఇప్పుడు విశాఖను పరిపాలన రాజధాని చేస్తుంటే ఆయనకు బాధగా ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. కానీ విశాఖను రాజధానిగా ఎవరూ కాదనలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని.. ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు, మేధావులు, సంఘాలు బ్రహ్మాండంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయని గంటా చెప్పారు. […]
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మరోసారి తెలుగుదేశం వైఖరిని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధానిని చేయడాన్ని టీడీపీ వ్యతిరేకించడాన్ని గంటా తప్పుపట్టారు. రాజధానిగా అమరావతిని చంద్రబాబు ఎంపిక చేశారు కాబట్టి… ఇప్పుడు విశాఖను పరిపాలన రాజధాని చేస్తుంటే ఆయనకు బాధగా ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. కానీ విశాఖను రాజధానిగా ఎవరూ కాదనలేని పరిస్థితి ఉందన్నారు.
ప్రభుత్వ ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని.. ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు, మేధావులు, సంఘాలు బ్రహ్మాండంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయని గంటా చెప్పారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆలోచన చేయాల్సిన సమయం ఇది అన్నారు.
విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చాలని తాను తొలి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నానని గుర్తు చేశారు. పరిపాలన రాజధానిగా ఉండేందుకు విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
అమరావతిలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అక్కడ పనిచేసే అధికారులు వారం వారం హైదరాబాద్‌కు వెళ్లి రావాల్సి వస్తోందన్నారు. అదే విశాఖను పరిపాలన రాజధాని చేస్తే అధికారులు, ఉద్యోగులు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు.
విద్య, వైద్యంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం, బీచ్ విశాఖ సొంతమన్నారు. కాబట్టి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా తాము స్వాగతిస్తున్నట్టు గంటా చెప్పారు.