ఆఖరివన్డేకి దీపక్ చహార్ దూరం
చహార్ స్థానంలో నవదీప్ సైనీ కటక్ వేదికగా సూపర్ సండే వన్డే వెస్టిండీస్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా…కటక్ బారాబటీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే నిర్ణయాత్మక ఆఖరి వన్డేకి భారత ఓపెనింగ్ బౌలర్ దీపక్ చహార్ దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో చహార్ అందుబాటులో లేకపోడంతో…యువఫా్స్ట్ బౌలర్ నవదీప్ సైనీకి జట్టులో చోటు కల్పించినట్లు బీసీసీఐ ప్రకటించింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండువన్డేల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో ఆఖరి వన్డే నిర్ణయాత్మకంగా […]
- చహార్ స్థానంలో నవదీప్ సైనీ
- కటక్ వేదికగా సూపర్ సండే వన్డే
వెస్టిండీస్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా…కటక్ బారాబటీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే నిర్ణయాత్మక ఆఖరి వన్డేకి భారత ఓపెనింగ్ బౌలర్ దీపక్ చహార్ దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో చహార్ అందుబాటులో లేకపోడంతో…యువఫా్స్ట్ బౌలర్ నవదీప్ సైనీకి జట్టులో చోటు కల్పించినట్లు బీసీసీఐ ప్రకటించింది.
మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండువన్డేల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో ఆఖరి వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఆఖరి వన్డేలో విజేతగా నిలిచినజట్టుకే విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో రెండుజట్లూ విజయమే లక్ష్యంగా నాకౌట్ పంచ్ కు సిద్ధమవుతున్నాయి.
స్లోబౌలర్లకు అనువుగా ఉండే బారాబటీ స్టేడియం పిచ్ పైన మ్యాచ్ నెగ్గాలంటే…టాస్ నెగ్గడం కూడా కీలకం కానుంది. చెన్నైలో ముగిసిన తొలివన్డేలో కరీబియన్ టీమ్ 8 వికెట్లతో భారత్ ను చిత్తు చేస్తే…విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ రికార్డు స్కోరుతో విండీస్ ను దెబ్బకు దెబ్బ తీయడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలువగలిగింది.
ఆఖరి వన్డే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.