అరవై ఆరేళ్ళ వయసులో పెళ్ళి....
పరస్పరం ప్రేమించుకోవడం అనేది రెండు హృదయాల మధ్య దగ్గర తనానికి సూచిక. ఆ హృదయాలు పసి హృదయాలు కావచ్చు, యువ హృదయాలు కావచ్చు. వృద్ధ హృదయాలూ కావచ్చు. ఇక్కడ వయసు దేహాల కే కానీ మనసులకు కాదనేది గుర్తుంచుకోవాలి. కేరళ కి చెందిన ఇద్దరు వృద్ధ స్నేహితులు వృద్ధాశ్రమంలో డిసెంబర్ 30వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెండ్లికి వారి మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రేమే కారణం. త్రిచూర్ జిల్లా తైకట్టుచెరే కి చెందిన లక్ష్మి […]
పరస్పరం ప్రేమించుకోవడం అనేది రెండు హృదయాల మధ్య దగ్గర తనానికి సూచిక. ఆ హృదయాలు పసి హృదయాలు కావచ్చు, యువ హృదయాలు కావచ్చు. వృద్ధ హృదయాలూ కావచ్చు. ఇక్కడ వయసు దేహాల కే కానీ మనసులకు కాదనేది గుర్తుంచుకోవాలి. కేరళ కి చెందిన ఇద్దరు వృద్ధ స్నేహితులు వృద్ధాశ్రమంలో డిసెంబర్ 30వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెండ్లికి వారి మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రేమే కారణం.
త్రిచూర్ జిల్లా తైకట్టుచెరే కి చెందిన లక్ష్మి అమ్మాళ్ 21 సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయారు. మరణశయ్యపై ఉన్న భర్త.. తనకు క్యాటరింగ్ లో అసిస్టెంట్ గా పనిచేసిన కొచ్చానియన్ని తన మరణం తర్వాత భార్య లక్ష్మి బాధ్యతను తీసుకోవలసిందిగా కోరాడు. ఆ తర్వాత లక్ష్మి, కొనియచ్చానియన్ లు ప్రేమలో పడ్డారు. అయినా ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు.
ఇటీవల కొచ్చానియన్ పని చేసుకుంటూ స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయాడు. ఒక ఎన్జీవో ఆయనకు వైద్య సహాయం అందించి ఒక వృద్ధాశ్రమంలో చేర్చింది. అయితే అప్పటికే అదే వృద్ధాశ్రమంలో లక్ష్మీ అమ్మాళ్ 11 నెలలు గా ఉంటున్నారు. తన స్నేహితుని చూసిన లక్ష్మి ఎంతో సంతోషించింది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని, ప్రేమను ఆ 65 ఏళ్ల వృద్ధురాలు తోటి వృద్ధులకు చెప్పుకుంది.
ఆ నోటా ఈ నోటా ఈ విషయం వృద్ధాశ్రమం సూపరింటెండెంట్ కి తెలిసింది. అతడు వారికి పెండ్లి చేయాలని నిర్ణయించాడు. కొచ్చానియన్ అరవై ఆరేళ్ళ వయసులో తన చిరకాల స్నేహితురాలు లక్ష్మిని పెండ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
ప్రేమకు, పెండ్లికి వయసుతో నిమిత్తం లేదని ఈ వృద్ధ ప్రేమికుల కథ చెబుతోంది. దిక్కుమొక్కులేని వీరు ఒకరికి ఒకరు తోడునీడగా పరస్పరం నిలవడానికి నిర్ణయించుకోవడం ఎందరికో మార్గదర్శకం కానుంది.