Telugu Global
NEWS

విశాఖవన్డేలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్

వన్డేల్లో రండుహ్యాట్రిక్ లు సాధించిన భారత తొలి బౌలర్ అంతర్జాతీయ క్రికెట్లో గత నాలుగు మాసాలుగా పడుతూ లేస్తూ వచ్చిన భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో వెస్టిండీస్ తో ముగిసిన రెండోవన్డేలో స్పిన్ జాదూతో హ్యాట్రిక్ నమోదు చేశాడు. వాసిం అక్రం, ట్రెంట్ బౌల్ట్ లాంటి హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు. 388 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్ ..భారత బౌలర్ల […]

విశాఖవన్డేలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్
X
  • వన్డేల్లో రండుహ్యాట్రిక్ లు సాధించిన భారత తొలి బౌలర్

అంతర్జాతీయ క్రికెట్లో గత నాలుగు మాసాలుగా పడుతూ లేస్తూ వచ్చిన భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో వెస్టిండీస్ తో ముగిసిన రెండోవన్డేలో స్పిన్ జాదూతో హ్యాట్రిక్ నమోదు చేశాడు. వాసిం అక్రం, ట్రెంట్ బౌల్ట్ లాంటి హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు.

388 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్ ..భారత బౌలర్ల ధాటికి కకావికలైపోయింది. ప్రధానంగా లెఫ్టామ్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి…విండీస్ ఘోరపరాజయంలో ప్రధానపాత్ర వహించాడు.

మిడిలార్డర్ ఆటగాళ్లు రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ వరుస బంతుల్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో చిక్కారు. భారత వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన భారత తొలిబౌలర్ గా కుల్దీప్ రికార్డుల్లో చేరాడు. తన 8వ ఓవర్లో కుల్దీప్ ఈ రికార్డు నమోదు చేయగలిగాడు.

అప్పుడు కోల్ కతా- ఇప్పుడు విశాఖ…

25 సంవత్సరాల కుల్దీప్ కు 2017 సిరీస్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన వన్డేలో తొలి హ్యాట్రిక్ సాధించిన ఘనత ఉంది. ఆ తర్వాత రెండేళ్ల విరామం తర్వాత రెండో హ్యాట్రిక్ నమోదు చేయగలిగాడు.

భారత క్రికెటర్లలో చేతన్ శర్మ, కపిల్ దేవ్,మహ్మద్ షమీలకు మాత్రమే ఒక్కోసారి హ్యాట్రిక్ సాధించిన రికార్డు ఉంది.

హేమాహేమీల సరసన….

వన్డే క్రికెట్ చరిత్రలోనే రెండుసార్లు హ్యాట్రిక్ లు నమోదు చేసిన దిగ్గజాలలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ వాసిం అక్రం, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, శ్రీలంక మాజీ స్వింగ్ బౌలర్ చమిందా వాస్, పాక్ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ ఉన్నారు.

ఒకే ఒక్కడు లాసిత్ మలింగా

ఒకటి కాదు…రెండుకాదు…ఏకంగా మూడు అంతర్జాతీయ వన్డే హ్యాట్రిక్ లు సాధించిన ఏకైక, ఒకేఒక్క బౌలర్ ఘనత శ్రీలంక యార్కర్ల కింగ్ లాసిత్ మలింగకు మాత్రమే ఉంది.

First Published:  19 Dec 2019 6:04 AM IST
Next Story