Telugu Global
NEWS

ఉత్తరాంధ్ర అంటే అంత చిన్నచూపా? " రాజీనామాకు సిద్ధం.... టీడీపీలో ప్రకంపనలు

మూడు రాజధానుల ఆలోచనను టీడీపీ నాయకత్వం వ్యతిరేకించడంపై ఆ పార్టీలోనే ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, కేఈ కృష్ణమూర్తి… జగన్ నిర్ణయాన్ని స్వాగతించి టీడీపీకి షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి, టీడీపీ నేత కొండ్రు మురళీ మరో అడుగు ముందుకేసి… విశాఖలో కార్యనిర్వాహణ వ్యవస్థ ఏర్పాటు చేస్తే టీడీపీ నేతలకు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. అమరావతిలో ఎన్నికోట్లు తీసుకెళ్లి పోసినా ఆ సొమ్ము బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నారు. విశాఖలో పాలన […]

ఉత్తరాంధ్ర అంటే అంత చిన్నచూపా?  రాజీనామాకు సిద్ధం.... టీడీపీలో ప్రకంపనలు
X

మూడు రాజధానుల ఆలోచనను టీడీపీ నాయకత్వం వ్యతిరేకించడంపై ఆ పార్టీలోనే ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, కేఈ కృష్ణమూర్తి… జగన్ నిర్ణయాన్ని స్వాగతించి టీడీపీకి షాక్ ఇచ్చారు.

మాజీ మంత్రి, టీడీపీ నేత కొండ్రు మురళీ మరో అడుగు ముందుకేసి… విశాఖలో కార్యనిర్వాహణ వ్యవస్థ ఏర్పాటు చేస్తే టీడీపీ నేతలకు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. అమరావతిలో ఎన్నికోట్లు తీసుకెళ్లి పోసినా ఆ సొమ్ము బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నారు. విశాఖలో పాలన విభాగాన్ని ఏర్పాటు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు ఇంతగా బాధపడిపోతున్నారని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రలో కోటి మంది ప్రజలు ఉన్నారని… ఈ ప్రాంతం అంటే ఇంత చిన్న చూపు ఎందుకని టీడీపీ పెద్దలను కొండ్రు మురళీ ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా విశాఖను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నాలను ఆయన వివరించారు.

విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఐటీ కంపెనీలు ముందుకొస్తే…. వాటిని అక్కడ కాకుండా విజయవాడకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని… దాంతో ఆ కంపెనీలు రాష్ట్రాన్నే వదిలేసి బెంగళూరు, చెన్నై తరలిపోయింది నిజం కాదా అని కొండ్రు మురళీ నిలదీశారు.

ఈ విషయంలో టీడీపీ తన విధానాన్ని మార్చుకోకపోతే రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్దమని కొండ్రు ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు విభాగాలను ఏర్పాటు చేస్తుంటే తెలుగుదేశం, జనసేనలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని నిలదీశారు.

అమరావతిని చూసి ఎవడైనా అక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఈ అంశంలో ఉత్తరాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని కొండ్రు మురళీ పిలుపునిచ్చారు.

First Published:  19 Dec 2019 6:48 AM IST
Next Story