Telugu Global
NEWS

విశాఖ వన్డేలో భారత్-విండీస్ కెప్టెన్ల చెత్త రికార్డు

విరాట్ కొహ్లీ, పోలార్డ్ గోల్డెన్ డకౌట్లు ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో ఓ అరుదైన రికార్డు విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య ముగిసిన రెండోవన్డేలో చోటు చేసుకొంది.600 కు పైగా పరుగులు, రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు నమోదైన ఈ మ్యాచ్ మాత్రం వ్యక్తిగతంగా రెండుజట్ల కెప్టెన్లకు చేదు అనుభవంగా మిగిలిపోతుంది. భారత్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ ఇద్దరూ ఎదుర్కొన్న తొలి […]

విశాఖ వన్డేలో భారత్-విండీస్ కెప్టెన్ల చెత్త రికార్డు
X
  • విరాట్ కొహ్లీ, పోలార్డ్ గోల్డెన్ డకౌట్లు

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో ఓ అరుదైన రికార్డు విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య ముగిసిన రెండోవన్డేలో చోటు చేసుకొంది.600 కు పైగా పరుగులు, రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు నమోదైన ఈ మ్యాచ్ మాత్రం వ్యక్తిగతంగా రెండుజట్ల కెప్టెన్లకు చేదు అనుభవంగా మిగిలిపోతుంది.

భారత్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ ఇద్దరూ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్లుగా వెనుదిరగడం విశేషం. సెంచరీల మొనగాడు, పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ..ఆట 37వ ఓవర్లలో క్రీజులోకి అడుగుపెట్టాడు.

పోలార్డ్ బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలిబంతికే టాప్ ఎడ్జ్ క్యాచ్ ఇచ్చి..చేజ్ పట్టిన క్యాచ్ కు డకౌట్ గా చిక్కాడు. వన్డే క్రికెట్లో విరాట్ కొహ్లీ డకౌట్ కావడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది.

మరోవైపు…విండీస్ కెప్టెన్ పోలార్డ్ కు సైతం ఇదే అనుభవం ఎదురయ్యింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్ లో పోలార్డ్ ఎదుర్కొన్న తొలిబంతికే… వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి.. డకౌటయ్యాడు.

ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో రెండుజట్ల కెప్టెన్లు డకౌట్లు కావడం ఇదే మొదటిసారి.

First Published:  19 Dec 2019 6:08 AM IST
Next Story