జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం !
ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి ల్యాండ్ పూలింగులో ఇచ్చిన అసైన్డ్ భూములను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్ భూములు కొనుగోలు చేసి లాండ్ పులింగ్ లో భూములు ఇచ్చిన వారికి సర్కార్ నిర్ణయంతో షాక్ తగిలింది. గత ప్రభుత్వం కేటాయించిన కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీ 1977 అసైన్డ్ […]
ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి ల్యాండ్ పూలింగులో ఇచ్చిన అసైన్డ్ భూములను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్ భూములు కొనుగోలు చేసి లాండ్ పులింగ్ లో భూములు ఇచ్చిన వారికి సర్కార్ నిర్ణయంతో షాక్ తగిలింది. గత ప్రభుత్వం కేటాయించిన కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఏపీ 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని స్పష్టం చేసింది . ల్యాండ్ పూలింగులో ఇచ్చిన అసైన్డ్ భూములను అసలు హక్కుదారులకు తిరిగి ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చజరిగింది… దీనిపై ఓ నిర్ణయానికి వచ్చిన సర్కార్… తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాజధాని ప్రాంతంలో సేకరించిన అసైన్డ్ భూముల్లో ఎక్కువగా ఓ మాజీ మంత్రి, ఆయన బినామీలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆమంత్రితో పాటు మరో ఇద్దరు మంత్రులకు ఈ లావాదేవీల్లో వాటా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అసైన్డ్ భూములు తీసుకుని కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం ఇటీవల పరిశీలించింది. ఇందులో 450 ఎకరాల అసైన్డ్ భూములు అసలు యజమానులు కాకుండా ఇతరులు దక్కించుకున్నట్లు తేలింది. ఈ జాబితాలో ఓ మాజీమంత్రి బినామీలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరో 1,100 ఎకరాల అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ భూముల్లో కూడా ఇలాంటి లావాదేవీలు జరిగాయని అనుమానాలు ఉన్నాయి.
మొత్తానికి న్యాయపరంగా ఎదురయ్యే అన్ని చిక్కులను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లంక భూముల్లో కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగాయని…అక్కడ తెలుగుదేశం నేతలే పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు కొన్నారని..వాటిని కూడా రాబోయే రోజుల్లో పరిశీలిస్తారని ప్రచారం జరుగుతోంది.