అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖ.... ఇంత బ్యాగ్రౌండ్ వర్క్ జరిగిందా?
అమరావతిని రాజధానిగా వద్దనుకున్న జగన్ వ్యూహాత్మకంగా మూడు రాజధానులను తెరపైకి తెచ్చారని… అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖను ముందే ఖాయం చేశారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. జగన్ ప్రకటనకు ముందే విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలు చూశాక.. జగన్ ముందే విశాఖను ఏపీ రాజధానిగా అనధికారికంగా ఖాయం చేశారని అంటున్నారు. ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖను చేయబోతున్నారనే విషయం వైసీపీ సర్కారును నడిపిస్తున్న జగన్ తో సహా కీలకమైన ముగ్గురు నలుగురికి మాత్రమే తెలుసట. ఈ మేరకు అంతా సిద్ధమయ్యాకే […]
అమరావతిని రాజధానిగా వద్దనుకున్న జగన్ వ్యూహాత్మకంగా మూడు రాజధానులను తెరపైకి తెచ్చారని… అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖను ముందే ఖాయం చేశారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. జగన్ ప్రకటనకు ముందే విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలు చూశాక.. జగన్ ముందే విశాఖను ఏపీ రాజధానిగా అనధికారికంగా ఖాయం చేశారని అంటున్నారు.
ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖను చేయబోతున్నారనే విషయం వైసీపీ సర్కారును నడిపిస్తున్న జగన్ తో సహా కీలకమైన ముగ్గురు నలుగురికి మాత్రమే తెలుసట. ఈ మేరకు అంతా సిద్ధమయ్యాకే విశాఖను ఏపీకి పరిపాలన రాజధానిగా చేశారని సమాచారం.
విశాఖకు ఒక్క మెట్రో రైల్ తప్పితే అన్ని సౌకర్యాలున్నాయి… ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు… కావాల్సినంత ప్రభుత్వ భూమి, మెట్రో పాలిటిన్ సిటి, మౌలిక సదుపాయాలున్నాయి.. అందుకే దీన్ని ఎంపిక చేశారని తెలిసింది.
విశాఖలో దాదాపు 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ సచివాలయం నిర్మించేందుకు జగన్ డిసైడ్ అయ్యారట.. ఇక విశాఖలో ఖాళీగా ఉన్న విజయవాడకు చెందిన ఓ బడా టైకూన్ సాఫ్ట్ వేర్ కంపెనీని తాత్కాలిక సచివాలయంగా జగన్ సర్కారు నిర్ణయించిందట. సదరు యజమానితో జగన్ సర్కారు చర్చలు జరిపి ఓకే చేయించుకుందని సమాచారం.
ఇక మిగతా ప్రభుత్వ కార్యాలయాల కోసం ఆంధ్రా యూనివర్సిటీలో ఖాళీగా చాలా భవనాలున్నాయి. విశాలమైన ఏయూలోని ఈ భవనాలను కూడా వాడుకోవాలని జగన్ సర్కారు యోచిస్తోంది.
ఇలా జగన్ ప్రీప్లాన్ డ్ గానే ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించారని తెలిసింది. ఈ ప్లాన్ తెలియక చంద్రబాబు, టీడీపీ నేతలు అవాక్కయ్యారని తెలిసింది.