నో సస్పెన్స్.. ఓన్లీ లవ్
క్రిస్మస్ కోసం ముస్తాబైంది ఇద్దరి లోకం ఒకటే సినిమా. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ను రాత్రి రిలీజ్ చేశారు. ఎలాంటి సస్పెన్స్ డ్రామాలు, ట్విస్టులు లేకుండా పాయింట్ ఏంటనేది ట్రయిలర్ లోనే చెప్పేశారు. ఇదొక సింపుల్ లవ్ స్టోరీ అనే విషయం ట్రయిలర్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. చిన్నప్పుడే హీరోహీరోయిన్లు విడిపోతారు. 18 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. హీరో, హీరోయిన్ కు ఐ లవ్ యు చెబుతాడు. హీరోయిన్ […]

క్రిస్మస్ కోసం ముస్తాబైంది ఇద్దరి లోకం ఒకటే సినిమా. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ను రాత్రి రిలీజ్ చేశారు. ఎలాంటి సస్పెన్స్ డ్రామాలు, ట్విస్టులు లేకుండా పాయింట్ ఏంటనేది ట్రయిలర్ లోనే చెప్పేశారు.
ఇదొక సింపుల్ లవ్ స్టోరీ అనే విషయం ట్రయిలర్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. చిన్నప్పుడే హీరోహీరోయిన్లు విడిపోతారు. 18 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. హీరో, హీరోయిన్ కు ఐ లవ్ యు చెబుతాడు. హీరోయిన్ మాత్రం తను పెరిగిన వాతావరణం కారణంగా తిరస్కరిస్తుంది. తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె, అతడి ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఇద్దరూ కలిసిపోతారు.
ఇదేదో ఊహించి మేం ఇక్కడ చెబుతోంది కాదు. ఈ మేటర్ మొత్తాన్ని ట్రయిలర్ లోనే విడమర్చి చెప్పేశారు. ఇక్కడ మేకర్స్ ఉద్దేశం ఒకటే. కథ-స్క్రీన్ ప్లే ఏంటనేది ఇంపార్టెంట్ కాదు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీని, ఆ ప్రేమను ఫీల్ అయితే చాలనేది వీళ్లు ఉద్దేశం. ఆ మేరకు ట్రయిలర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. హీరోహీరోయిన్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈనెల 25న థియేటర్లలోకి రానుంది ఈ లవ్ జర్నీ.
Guysssss!! Here’s the theatrical trailer of #IddariLokamOkate
Hope u like it!! ?https://t.co/zHtsznRrCR
Movie is releasing on 25th Dec!!
See u guys in theatres ❤️?— Raj Tarun (@itsRajTarun) December 17, 2019