జనవరి నుంచి పల్లెబాట.... విందులో జగన్ డైరెక్షన్ !
విజయవాడలోని బరంపార్క్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి జగన్ విందు ఇచ్చారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల టేబుల్ వద్దకు వెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలతో సీఎం సమావేశమయ్యారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి పనిచేయాలని, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సీఎం సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు రెండు కళ్ల లాంటివారు అని చెప్పారు. అన్ని అంశాల్లో పాలు నీళ్లలా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం సూచించారు. సంక్షేమ […]
విజయవాడలోని బరంపార్క్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి జగన్ విందు ఇచ్చారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల టేబుల్ వద్దకు వెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలతో సీఎం సమావేశమయ్యారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి పనిచేయాలని, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సీఎం సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు రెండు కళ్ల లాంటివారు అని చెప్పారు.
అన్ని అంశాల్లో పాలు నీళ్లలా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం సూచించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని అన్నారు. తనకు ప్రజల ప్రయోజనాలే అంతిమమని చెప్పారు. జిల్లాలో కూడా కోఆర్డినేషన్ కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెడతాయని జగన్ అన్నారు. జనవరి నుంచి ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలని సూచించారు. ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు గ్రామ సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయో చూడాలని చెప్పిన జగన్.. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో పరిశీలించాలని కోరారు.