Telugu Global
NEWS

ఉత్తరాంధ్ర జేఏసీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి

అభివృద్దిని మూడు ప్రాంతాలకు వికేంద్రీకరిస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటనపై కొందరు రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులైన రైతులు మందడం గ్రామంలో ఆందోళనకు దిగారు. రాజధానిని తరలిస్తే విషం తాగుతామంటూ పురుగుల మందు డబ్బాలతో వచ్చారు. అయితే వారెవరూ పురుగుల మందు తాగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తూ ఉత్తరాంధ్ర జేఏసీ నేత తారకరామారావు ప్లకార్డు ప్రదర్శించగా.. టీడీపీ సానుభూతిపరులు దాడి చేసి కొట్టారు. […]

ఉత్తరాంధ్ర జేఏసీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి
X

అభివృద్దిని మూడు ప్రాంతాలకు వికేంద్రీకరిస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటనపై కొందరు రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులైన రైతులు మందడం గ్రామంలో ఆందోళనకు దిగారు. రాజధానిని తరలిస్తే విషం తాగుతామంటూ పురుగుల మందు డబ్బాలతో వచ్చారు. అయితే వారెవరూ పురుగుల మందు తాగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తూ ఉత్తరాంధ్ర జేఏసీ నేత తారకరామారావు ప్లకార్డు ప్రదర్శించగా.. టీడీపీ సానుభూతిపరులు దాడి చేసి కొట్టారు. విశాఖ పరిపాలన రాజధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… ఉత్తరాంధ్ర జేఏసీ నాయకుడిపై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జేఏసీ నేతను దాడి నుంచి రక్షించి మందడం ఔట్‌పోస్టు వద్దకు చేర్చారు.

First Published:  18 Dec 2019 7:27 AM IST
Next Story