వైసీపీలో రాజ్యసభ హడావుడి... వెళ్లే ఆ నలుగురు వీళ్లేనా ?
రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు పెద్దల ఎంపిక ఎలా చేస్తారు? అమరావతిలో ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు తొలిసారి వైసీపీ తరపున నలుగురు ఎంపీలు వెళుతున్నారు. దీంతో జగన్ ఎంపిక ఎలా ఉండబోతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ తరపున ఇప్పుడు రాజ్యసభలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు సార్లు ఎన్నికలు జరిగితే ఒక సీటు గెలుచుకునే చాన్స్ వచ్చింది. దీంతో పార్టీకి […]
రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు పెద్దల ఎంపిక ఎలా చేస్తారు? అమరావతిలో ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు తొలిసారి వైసీపీ తరపున నలుగురు ఎంపీలు వెళుతున్నారు. దీంతో జగన్ ఎంపిక ఎలా ఉండబోతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
వైసీపీ తరపున ఇప్పుడు రాజ్యసభలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు సార్లు ఎన్నికలు జరిగితే ఒక సీటు గెలుచుకునే చాన్స్ వచ్చింది. దీంతో పార్టీకి అవసరమైన ఇద్దరు కీలక నేతలను రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, టీడీపీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ కూడా తోడైతే బలం 153కి చేరుతుంది. ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి.
వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లే వారిలో కీలక పేర్లు విన్పిస్తున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన పశ్చిమగోదావరి జిల్లా నేతలు గోకరాజు రంగరాజు లేదా ఆయన కుమారుడికి రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చెక్ పెట్టేందుకు ఈ కుటుంబాన్ని తెరపైకి తెచ్చారని… అందుకే వారిని ఢిల్లీకి పంపి ఆయనకు గట్టి సిగ్నల్స్ పంపిస్తారని తెలుస్తోంది.
మరోవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డికి కూడా సీటు ఇస్తారని సమాచారం. ఈయన చాలా కాలంగా వైసీసీకి గట్టి మద్దతుదారుడు. అంతేకాకుండా…పార్టీకి అవసరమైనప్పుడు ఆర్థికంగా ఆదుకున్నారనే పేరుంది.
వీరితో పాటు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక, నెల్లూరులో ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్‌రావులకు కూడా సీటు దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
సామాజికవర్గాల బ్యాలెన్స్ కోసం ఓ రెడ్డి, ఒక రాజు, ఒక బీసీతో పాటు ఇంకొకరికి చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి రాజ్యసభ రేసులో ఉండేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. జగన్ దగ్గరకు తమ బయోడేటా చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.