Telugu Global
Cinema & Entertainment

రౌడీ పోలీస్.. రజనీ అదుర్స్

గన్ పట్టాల్సిన పోలీస్ కత్తి పడితే ఎలా ఉంటుంది. రౌడీలు చేయాల్సిన గుండాయిజాన్ని ఓ పోలీస్ విచ్చలవిడిగా చేస్తే ఎలా ఉంటుంది. దర్బార్ ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. రౌడీ పోలీస్ గా రజనీకాంత్ చించేశాడు. నిన్న రాత్రి ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. వయసు పెరుగుతున్నా మాస్ మంత్రి విడిచిపెట్టని రజనీకాంత్, ఈసారి దర్బార్ తో మరోసారి మెస్మరైజ్ చేశారు. ఫస్ట్ టైమ్ మురుగదాస్ కు అవకాశం ఇచ్చాడు సూపర్ స్టార్. జీవితంలో […]

రౌడీ పోలీస్.. రజనీ అదుర్స్
X

గన్ పట్టాల్సిన పోలీస్ కత్తి పడితే ఎలా ఉంటుంది. రౌడీలు చేయాల్సిన గుండాయిజాన్ని ఓ పోలీస్ విచ్చలవిడిగా చేస్తే ఎలా ఉంటుంది. దర్బార్ ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. రౌడీ పోలీస్ గా రజనీకాంత్ చించేశాడు. నిన్న రాత్రి ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

వయసు పెరుగుతున్నా మాస్ మంత్రి విడిచిపెట్టని రజనీకాంత్, ఈసారి దర్బార్ తో మరోసారి మెస్మరైజ్ చేశారు. ఫస్ట్ టైమ్ మురుగదాస్ కు అవకాశం ఇచ్చాడు సూపర్ స్టార్. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు మురుగదాస్. రజనీకాంత్ ను మరోసారి మాస్ లుక్ లో, అతడి స్టయిల్ ఏమాత్రం చెడకుండా అద్భుతంగా చూపించాడు.

తాజా ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ముంబయి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, అనిరుధ్ సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

DARBAR (Telugu) – Official Trailer | Rajinikanth | A.R.Murugadoss | Anirudh Ravichander | Subaskaran

Presenting the Official Trailer of Darbar (Telugu)'; Starring Rajinikanth & #Nayanthara in lead roles, Music Composed by Anirudh Ravichander, Produced by Lyca Productions & Directed by AR Murugadoss.Divo Gaana

Posted by Darbar on Monday, 16 December 2019

First Published:  17 Dec 2019 6:02 AM IST
Next Story