లోక్ సభ సీట్లు 1000...
దేశంలో లోక్ సభ సీట్ల సంఖ్య 1000కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆ మేరకు రాజ్యసభ సీట్ల సంఖ్య కూడా పెంచాలన్నారు. ఒక్కో లోకసభ స్థానానికి ప్రాతినిధ్యంలో జనాభా పరంగా చాలా తేడా ఉందని గుర్తు చేశారు. ఒక్కో ఎంపీ 16నుంచి 18లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని…. అంత మంది బాగోగులు ఒక ఎంపీ ఎలా చూడగలరని ప్రణబ్ ప్రశ్నించారు. 1977లో లోకసభ సీట్లు పెంచినప్పుడు దేశ జనాభా 55 […]
దేశంలో లోక్ సభ సీట్ల సంఖ్య 1000కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆ మేరకు రాజ్యసభ సీట్ల సంఖ్య కూడా పెంచాలన్నారు.
ఒక్కో లోకసభ స్థానానికి ప్రాతినిధ్యంలో జనాభా పరంగా చాలా తేడా ఉందని గుర్తు చేశారు. ఒక్కో ఎంపీ 16నుంచి 18లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని…. అంత మంది బాగోగులు ఒక ఎంపీ ఎలా చూడగలరని ప్రణబ్ ప్రశ్నించారు.
1977లో లోకసభ సీట్లు పెంచినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమేనని…. ప్రస్తుతం జనాభా రెట్టింపు అయినందున లోకసభ సీట్లు 1000కి పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రజలు ఒక పార్టీకి సంఖ్యా పరంగా ఎక్కువ సీట్లు ఇస్తున్నారే గాని… మెజారిటీ ఓటర్లు ఒకే పార్టీకి మద్దతు పలకడం లేదన్నారు. కాబట్టి అధికారంలో ఉన్నవారు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని కోరారు.
అఖండ మెజారిటీ రాగానే ఏమైనా చేయవచ్చు అనుకోవటం పొరపాటు అని… అలా భావించిన పార్టీలకు ఆ తర్వాత అదే ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు ప్రణబ్.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించటం ఒకసారి మాత్రమే సాధ్యం అవుతుందని… పదేపదే సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.