చిరంజీవి టైటిల్స్ పై కార్తి క్లారిటీ
వరుసగా చిరంజీవి టైటిల్స్ వాడేస్తున్నాడంటూ కంప్లయింట్. మొన్నటికిమొన్న ఖైదీ టైటిల్ వాడేశాడు. ఇప్పుడు దొంగ టైటిల్ తో సినిమా రెడీ చేశాడు. దీంతో కార్తికి సహజంగానే ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై కార్తి కూడా అంతే సూటిగా రియాక్ట్ అయ్యాడు. “ఖైదీ టైటిల్ చిరంజీవి గారిది అని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఆ సినిమాకు కూడా అది యాప్ట్ టైటిల్. ఈ సినిమా కోసం ‘తమ్ముడు’ టైటిల్ అనుకున్నాం కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ‘దొంగ’ […]
వరుసగా చిరంజీవి టైటిల్స్ వాడేస్తున్నాడంటూ కంప్లయింట్. మొన్నటికిమొన్న ఖైదీ టైటిల్ వాడేశాడు. ఇప్పుడు దొంగ టైటిల్ తో సినిమా రెడీ చేశాడు. దీంతో కార్తికి సహజంగానే ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై కార్తి కూడా అంతే సూటిగా రియాక్ట్ అయ్యాడు.
“ఖైదీ టైటిల్ చిరంజీవి గారిది అని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఆ సినిమాకు కూడా అది యాప్ట్ టైటిల్. ఈ సినిమా కోసం ‘తమ్ముడు’ టైటిల్ అనుకున్నాం కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ‘దొంగ’ కూడా చిరంజీవి గారి టైటిల్ కావడం నిజంగా హ్యాపి.”
ఇలా తన సినిమాలకు చిరంజీవి టైటిల్స్ పెట్టుకోవడంపై ఆనందం వ్యక్తంచేశాడు కార్తి. అయితే ఇది కావాలని చేయలేదని, కథ ప్రకారం టైటిల్స్ అలా సెట్ అవుతున్నాయని చెబుతున్నాడు. భవిష్యత్తులో చిరంజీవి సినిమాలకు సంబంధించి మరో టైటిల్ వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాడు కార్తి.
“మీరు ‘ఊపిరి’ సినిమా చూస్తే ఆ సినిమాకు ‘దొంగ’ అని టైటిల్ పెట్టొచ్చు..కేవలం దొంగతనం చేయడమే కాదు ఇతరుల మనసుల్ని దోచుకున్నా ‘దొంగ’ టైటిల్ సరిపోతుంది. ఒక ‘దొంగ’ మంచి గా మారి అందరి హృదయాల్ని ఎలా దోచుకున్నాడనే స్టోరీ కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ అనిపించింది.”
ఇలా తన సినిమా టైటిల్స్ పై ఉన్నది ఉన్నట్టుగా స్పందించాడు కార్తి. వదిన జ్యోతికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని తను జీవితాంతం గుర్తుంచుకుంటానంటున్న కార్తీ.. రియల్ లైఫ్ లో వదినతో ఎలా ఉన్నానో, సినిమాలో కూడా అలానే ఉంటానని అంటున్నాడు.