ఢిల్లీకి 'దిశ' నిందితుల మృతదేహాలు..?
ఛటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ మృతదేహాలను ఢిల్లీకి తరలించమని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత నెలలో వెటర్నరీ వైద్యురాలి హద్యోదంతం తర్వాత నిందితులు ఈ నెల 6న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అదే రోజు మృతదేహాలకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధులకు అప్పగించాలని పోలీసులు భావించారు. అయితే హైకోర్టు ఆదేశాలతో మృతదేహాలను తొలుత మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి.. ఆ తర్వాత అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, […]
ఛటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ మృతదేహాలను ఢిల్లీకి తరలించమని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత నెలలో వెటర్నరీ వైద్యురాలి హద్యోదంతం తర్వాత నిందితులు ఈ నెల 6న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే.
అదే రోజు మృతదేహాలకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధులకు అప్పగించాలని పోలీసులు భావించారు.
అయితే హైకోర్టు ఆదేశాలతో మృతదేహాలను తొలుత మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి.. ఆ తర్వాత అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కాగా, హైకోర్టు ఈ నెల 13 వరకు మృతదేహాలను భద్రపరచమని తొలుత ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో కూడా విచారణ సాగుతోంది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు చెప్పింది. దీంతో ఆనాటి నుంచి గాంధీ మార్చురిలోనే భద్రపరిచారు.
అయితే సరైన సౌకర్యాలు లేక గాంధీ ఆసుపత్రిలో ఉంచిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. దీంతో 7,500 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్లు ఇచ్చి ఎంబామింగ్ చేశారు. ఎంత చేసినా ఏవో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఒక వేళ మరింత ఆలస్యమైతే రీపోస్టుమార్టానికి పనికి రావని వైద్యులు చెబుతున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అయితే ఎన్ని రోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉందని.. అక్కడకు తరలిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని గాంధీ వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వం అంగీకరిస్తే అతి త్వరగా వాటిని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది.