Telugu Global
NEWS

సౌరవ్ గంగూలీ- రవిశాస్త్రి భాయిభాయి

చేతులు కలిపిన బీసీసీఐ చైర్మన్, చీఫ్ కోచ్ తమ మధ్య అపోహలు లేవంటూ కోరస్ భారత క్రికెట్ బోర్డు చైర్మన్ సౌరవ్ గంగూలీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి తమ మధ్య ఏలాంటి అభిప్రాయభేదాలు లేవని, పరస్పర గౌరవం ఉందని చెప్పారు. తమ మధ్య మంచి సంబంధాలు లేవని ఎవరైనా భావిస్తే అది వారి ఖర్మ అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. గతంలో భారతజట్టు చీఫ్ కోచ్ ఎంపిక సమయంలో రవి శాస్త్రిని కాదని అనీల్ కుంబ్లేను ఎంపిక […]

సౌరవ్ గంగూలీ- రవిశాస్త్రి భాయిభాయి
X
  • చేతులు కలిపిన బీసీసీఐ చైర్మన్, చీఫ్ కోచ్
  • తమ మధ్య అపోహలు లేవంటూ కోరస్

భారత క్రికెట్ బోర్డు చైర్మన్ సౌరవ్ గంగూలీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి తమ మధ్య ఏలాంటి అభిప్రాయభేదాలు లేవని, పరస్పర గౌరవం ఉందని చెప్పారు.

తమ మధ్య మంచి సంబంధాలు లేవని ఎవరైనా భావిస్తే అది వారి ఖర్మ అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.

గతంలో భారతజట్టు చీఫ్ కోచ్ ఎంపిక సమయంలో రవి శాస్త్రిని కాదని అనీల్ కుంబ్లేను ఎంపిక చేయడంలో సౌరవ్ గంగూలీ ప్రధానపాత్ర వహించడంతో.. దుమారమే చెలరేగింది.

క్రికెట్ సలహామండలిలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ…రవిశాస్త్రి ఇంటర్వ్యూకు హాజరైన సమయంలో బయటకు వెళ్లిపోడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది.

గంగూలీ తీరుపట్ల రవిశాస్త్రి మండిపడ్డాడు. తనపట్ల కనీస మర్యాద పాటించలేదంటూ విరుచుకుపడ్డాడు. చాలాకాలం ఈ ఇద్దరూ ఎడమొకం పెడమొకంగా ఉంటూ వచ్చారు.

చైర్మన్ కావడంతో సీన్ రివర్స్….

అయితే…సౌరవ్ గంగూలీ అనూహ్యంగా బీసీసీఐ చైర్మన్ కావడం, రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా ఉండడంతో ఇద్దరూ పొరపొచ్చాలు వీడి చేయిచేయి కలపాల్సి వచ్చింది.

భారత క్రికెట్ ప్రయోజనాల కోసం కలసి పనిచేయాల్సి రావడంతో.. భాయి భాయి అనుకొంటూ దగ్గరయ్యారు.

చీఫ్ కోచ్ రవిశాస్త్రితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, తమ మధ్య మంచిసంబంధాలే ఉన్నాయని గతవారమే బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గతవారమే సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. తమ మధ్య సంబంధాలను ఎవరైనా వక్ర దృష్టితో చూస్తే అది తమకు సంబంధంలేని విషయమని దాదా తేల్చి చెప్పాడు.

గొంతు కలిపిన రవి శాస్త్రి…

సౌరవ్ గంగూలీ అంటే తనకు ఎంతో గౌరవమని…భారత క్రికెట్ క్లిష్ట పరిస్థితిలో చిక్కుకొన్నప్పుడు జట్టు పగ్గాలు చేపట్టిన సౌరవ్ గంగూలీ నాయకుడిగా చక్కటి సేవలు అందించాడని, దారితప్పిన భారత క్రికెట్ ను గాడిలో పెట్టాడంటూ రవిశాస్త్రి ప్రశంసించాడు.

భారత క్రికెట్ కు గంగూలీ సేవలు అపురూపమైనవనీ, బోర్డు చైర్మన్ గా ఎంపికై భారత క్రికెటర్ల గౌరవాన్ని ఇనుమడింప చేశారని కొనియాడాడు.

భారత చీఫ్ కోచ్ పదవి కత్తిమీద సాములాంటిదని…సోషల్ మీడియాలో తనపైన ఎవరు ఏవిధమైన కామెంట్లు చేసినా తాను పట్టించుకోనని రవిశాస్త్రి తేల్చి చెప్పాడు.

మనదేశంలో 130 కోట్ల జనాభా ఉన్నారని, వారిలో చాలామందికి ఏ పనీలేదని…ఎదుటి వ్యక్తుల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఓ అలవాటుగా మారిపోయిందని మండి పడ్డాడు.

తాను చీఫ్ కోచ్ గా బాధ్యతలు తీసుకొన్న సమయంలో 7వ ర్యాంక్ లో ఉన్న భారతజట్టును ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలబెట్టానని..అందరూ దీనిని గమనించాలని కోరాడు.

First Published:  16 Dec 2019 4:43 AM IST
Next Story