2020లో కేటీఆర్ పట్టాభిషేకం.... చండీయాగం తర్వాతే ముహూర్తం !
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు ప్రగతి భవన్ నుంచి వస్తున్నాయి. కేటీఆర్ ఇప్పటికే వెయిటింగ్ సీఎం లిస్ట్‌లో ఉన్నారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని కుటుంబ సభ్యుల నుంచి కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి ఉందని ప్రచారం జరుగుతోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేటీఆర్‌ను సీఎం చేస్తారని ప్రచారం జరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్,బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే…తన ఫెడరల్ ఫ్రంట్ కీలకమవుతుందని కేసీఆర్ భావించారు. తాను […]
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు ప్రగతి భవన్ నుంచి వస్తున్నాయి. కేటీఆర్ ఇప్పటికే వెయిటింగ్ సీఎం లిస్ట్‌లో ఉన్నారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని కుటుంబ సభ్యుల నుంచి కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి ఉందని ప్రచారం జరుగుతోంది.
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేటీఆర్‌ను సీఎం చేస్తారని ప్రచారం జరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్,బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే…తన ఫెడరల్ ఫ్రంట్ కీలకమవుతుందని కేసీఆర్ భావించారు. తాను ఢిల్లీకి వెళ్లి…కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ప్లాన్ వేశారు. అయితే ప్లాన్ మాత్రం వర్క్‌వుట్ కాలేదు. ఢిల్లీలో మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. ఇక్కడ టీఆర్ఎస్‌కు 17లో 16 సీట్లు వస్తాయని ఆశించారు. కానీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మొత్తానికి మళ్లీ 2020లో కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. ఇటు ఫిబ్రవరి లేదా మార్చిలో ఆయుత చండీయాగం ప్రారంభమవుతుంది. యాదాద్రి ప్రారంబోత్సవం చేసిన తర్వాత చండీయాగం మరోసారి నిర్వహించనున్నారు. ఈ యాగం ముగిసిన తర్వాత మంచి ముహూర్తం చూసి కేటీఆర్‌ను సీఎం చేస్తారని ప్రచారం జరుగుతోంది.
కేటీఆర్‌ను 2020లో సీఎం చేస్తే…. వచ్చే నాలుగేళ్లలో సెటిల్ అవుతారని కేసీఆర్ ఆలోచన. తన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే ముందే సీఎం చేయాలనేది కేసీఆర్ కుటుంబం ఆలోచన. అందుకే కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారట. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాత్రం కేసీఆర్ కొనసాగుతారని తెలుస్తోంది. మొత్తానికి అధికార మార్పిడిపై మళ్లీ గులాబీ దళంలో మాత్రం చర్చ జరుగుతోంది.