Telugu Global
National

కాళేశ్వరం ఎత్తిపోతలతో నీటి పంపింగ్‌లో మేఘాదే మెగా రికార్డ్‌

దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం అద్భుతాన్ని సృష్టించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది అయిన గోదావరిని దిగువ నుంచి ఎగువకు ప్రవహించేలా చేసి ఎలక్ట్రోమెకానికల్ రంగంలో ప్రపంచం కళ్లప్పగించి నివ్వెరపడే విధంగా గుర్తింపు సాధించింది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన తెలంగాణలోనే తొలిసారిగా ఓ భారీ నదిని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎగువకు నీటిని ఎదురు ప్రవహించే విధంగా వరల్డ్‌ వండర్‌ను […]

కాళేశ్వరం ఎత్తిపోతలతో నీటి పంపింగ్‌లో మేఘాదే మెగా రికార్డ్‌
X

దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం అద్భుతాన్ని సృష్టించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది అయిన గోదావరిని దిగువ నుంచి ఎగువకు ప్రవహించేలా చేసి ఎలక్ట్రోమెకానికల్ రంగంలో ప్రపంచం కళ్లప్పగించి నివ్వెరపడే విధంగా గుర్తింపు సాధించింది.

ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన తెలంగాణలోనే తొలిసారిగా ఓ భారీ నదిని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎగువకు నీటిని ఎదురు ప్రవహించే విధంగా వరల్డ్‌ వండర్‌ను తెలంగాణ సొంతం చేసుకుంది.

ప్రపంచంలో పెద్దవిగా పరిగణించే హంద్రీ-నీవా, కొలరాడో, గ్రేట్‌మ్యాన్‌మేడ్‌ రివర్‌ మొదలైన వాటి పంపింగ్‌తో పోలిస్తే కాళేశ్వరం తక్కువ సమయంలో వాటికన్నా ఎక్కువ నీటిని ఎగువకు ఎత్తిపోస్తోంది. ప్రపంచ నీటి పారుదల చిత్రపటంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ అద్భుతం ఆవిష్కృతం కావడం వెనుక మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (మేఘా) కృషి మరువలేనిది.

ఇంతవరకు ఎక్కడా లేనివిధంగా అత్యధిక సామర్థ్యం కలిగిన ఎలక్ట్రో మెకానికల్‌ వ్యవస్థను మేఘా అనతికాంలోనే ఏర్పాటు చేసింది. అంత పెద్ద ప్రాజెక్ట్‌… అందులోనూ భూగర్భంలో… పైగా సాంకేతిక, విద్యుత్‌ తదితర క్లిష్టమైన పనులు ఉన్న ఈ ప్రాజెక్ట్‌ దాదాపు మూడేళ్ళ సమయంలో పూర్తిచేసి విజయవంతంగా నీటిని గోదావరి నది ఎగువకు ప్రవహించే విధంగా పంప్‌ చేయడం అనేది మరో అద్భుతం.

అతి తక్కువ కాలంలో అతిపెద్ద ప్రాజెక్ట్…

సహజంగానే సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తికావడానికి దశాబ్దాల కాలం పడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడో ప్రారంభించిన నాగార్జున సాగర్‌, శ్రీరాం సాగర్‌, శ్రీశైలం ఎడమ-కుడి గట్టు కాలువ పథకాలు, తెలుగు గంగ మొదలైనవి ఇప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. ఆ ప్రాజెక్ట్‌లు ఒక్కొక్కటి పూర్తికావడానికి కనీసం రెండు దశాబ్దాల సమయం పట్టింది.

కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో క్లిష్టమైన పనులు ఉన్నప్పటికీ మూడేళ్ళలో రెండు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పూర్తికావడం మరో అరుదు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధారణ సాగునీటి ప్రాజెక్టుల్లాగా సులభంగా ఉండదు. అందులోనూ కాళేశ్వరంలో… భూగర్భంలో పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఉన్నాయి.

అయినప్పటికీ ప్రపంచంలోనే తొలిసారిగా అతి తక్కువ సమయంలో అంత పెద్ద ప్రాజెక్ట్‌ పూర్తి కావడంలో మేఘా కృషి అమోఘమైనది. ఇది మూడు దశాబ్దాల సాంకేతిక పనుల్లో అనుభవం, ఇంజనీరింగ్‌ నైపుణ్యం- అనుభవం, పట్టుదల వల్లనే సాధ్యమైంది.

కాళేశ్వరంలో కీలకం మేఘా పంపింగ్…

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాది జూన్‌ 21న సాంకేతికంగా ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించినప్పటికీ…. అప్పట్లో ప్రయోగాత్మకంగానే నీటిని మేడిగడ్డ లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి ఎత్తిపోసి ఆచరణలో సాధ్యమని చూపించగలిగారు.

ఆ తర్వాత క్రమంగా పనులను ప్రారంభిస్తూ ఇప్పటికే లింక్‌-1, లింక్‌-2ల్లో కీలకమైన పనులన్నింటినీ పూర్తి చేయగలిగింది. 300 మీటర్ల ఎగువన ఉన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని మిడ్‌మానేరు జలాశయానికి దాదాపు 25 టిఎంసీల నీటిని అనతికాలంలోనే ఎత్తిపోయడంలో మేఘా పంపింగ్‌ స్టేషన్లు కీలక భూమికను నిర్వహించాయి.

ఇప్పటివరకు దేశంలోనే కాదు ఆసియాలో పెద్దదిగా పరిగణించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం ఏడాది మొత్తం పంపింగ్‌ చేస్తే దాదాపు గరిష్టంగా 18 టిఎంసీల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. అదే విధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కూడా ఏడాది మొత్తం సరాసరిన 100 టిఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణకు తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లను కూడా మేఘా ఇంజనీరింగే నిర్మించింది.

రోజుకు 2 టీఎంసీ లు…

కాళేశ్వరంలో అనతికాలంలోనే (దాదాపు 20 రోజుల్లో ) 25 టిఎంసీల సామర్థ్యం కలిగిన మిడ్‌మానేరు జలాశయం నిండిందంటే అది మహాద్భుతమనే చెప్పాలి. అందులోనూ ఒకేసారి రోజుకు సరాసరి 2 టిఎంసీల నీటిని పంప్‌చేయడం. మధ్యలో జలాశయాల్లో నీటిని నిల్వ చేయడం అక్కడి నుంచి మళ్లీ పంప్‌చేయడం ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యేకత.

ఈ విధమైన ఇంజనీరింగ్‌ వ్యవస్థ మరే ఇతర ఎత్తిపోతల పథకాల్లోనూ లేదు. పట్టిసీమ నీటిని పంప్‌చేసిన తరువాత మొత్తం గురుత్వాకర్షణ మీదే నీరు ప్రవహిస్తుంది. హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌ మాత్రం ఈ పథకంతో పోలిస్తే చిన్నది అయినప్పటికీ ఎత్తిపోతల కేంద్రాల సంఖ్య, ప్రాజెక్ట్‌ పొడవు- పంపింగ్ ఎత్తుతో పోలిస్తే క్లిష్టమైనదే. అయితే పంపింగ్‌ సామర్థ్యం చిన్నది.

అటువంటి క్లిష్టమైన ప్రాజెక్ట్‌ మొత్తం సామర్థ్యం 40 టిఎంసీలు కాగా ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా 20 టిఎంసీల నీటి పంపింగ్‌కు చేరుకోలేకపోయింది. అందుకు సాంకేతిక, పంపింగ్‌ సమస్యలు కాదు. ప్రభుత్వ నిర్ణయాలు, నీటి లభ్యత మొదలైనవి. ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న జలాశయాలు కూడా చిన్నవే.

కానీ కాళేశ్వరంలో 2 టిఎంసీల రోజు పంపింగ్‌ ఆధారంగా కనీసం 160 టిఎంసీల నీటిని పంప్‌చేయవచ్చు. ప్రయోగ దశలోనే ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే అనతికాలంలోనే (మొత్తం ఆరు నెలలు అయినప్పటికీ పంపింగ్‌ పనిదినాలను పరిగణనలోకి తీసుకుంటే బాగా తక్కువ) 25 టిఎంసీల నీటిని ఎగువకు పంప్‌ చేసింది.

ఈ ప్రాజెక్ట్‌లో దాదాపు కీలకమైన నిర్మాణాలు అన్నీ అందులోనూ పంపింగ్‌ కేంద్రాలు, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ మొదలైన వాటిలో అత్యధిక భాగం మేఘానే నిర్మించింది. మేడిగడ్డ లక్ష్మీ, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లక్ష్మీపూర్‌ భూగర్భ గాయత్రి పంప్‌హౌస్‌లు లింక్‌-1, 2 లో చాలా కీలకమైనవి.

ఈ పంప్‌హౌస్‌లన్నీ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా విజయవంతంగా వినియోగంలోకి తేవడంలో తెలంగాణ నీటి పారుదల నిపుణులతో పాటు మేఘా, బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలం మొదలైన అంతర్జాతీయ సంస్థలు తమ పనితనాన్ని చాటుకున్నాయి.

లక్ష్మి పుంప్ హౌస్ తో మొదలు…..

ఈ ప్రాజెక్ట్‌లో లక్ష్మీ పంప్‌ హౌస్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉంది. గోదావరి ప్రవాహాన్ని తిరుగుబాట అంటే ఎగువకు ప్రవహించేలా చేయడంలో ఇది మొదటిది. ఈ ఏడాది జులై 5 నుంచి డిసెంబర్‌ 6 తేది వరకు 24.062 టిఎంసీల నీటిని ఎత్తిపోసింది. మొత్తం 3,157 గంటల సమయంలో ఇది సాధ్యమైందంటే సాధారణ విషయం కాదు. అందులోనూ మొత్తం 11 పంప్‌లు వినియోగంలోకి వచ్చేశాయి. ఇది మరో అరుదైన విషయం.

తొలుత 6వ పంప్‌ను ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించగా ఈ పంప్‌ అత్యధికంగా 489 గంటల పాటు పనిచేసి 3.72 టిఎంసీల నీటిని ఎగువకు చేర్చింది. ఇక తర్వాతి స్థానంలో 4వ పంప్‌ ఉండగా మిగిలిన పంప్‌లను వివిధ గంటల పాటు పనిచేసి దానికి తగినవిధంగా నీటిని అందించాయి.

40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఇక్కడి ఒక్కొక్క పంప్‌ గంటపాటు పనిచేస్తే 0.00762 నీటిని పంప్‌ చేస్తుంది. అంటే గ్రామాల్లో ఉండే ఒక చెరువు సామర్థ్యం లాంటిది. గంటలో ఈ పంప్‌ నుంచి చెరువును నింపవచ్చు. ఈ పంప్‌హౌస్‌ను జూన్‌లో ప్రారంభించినప్పటికీ నవంబర్‌ 11 నుంచే దాదాపు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చారు.

అదే విధంగా సరస్వతి పంప్‌హౌస్‌లో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంతో 8 మిషన్లను ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసింది. ఇక్కడ మొత్తం అన్ని మిషన్ లు పనిచేయడం ప్రారంభించగా ఈ ఏడాది జులై 22 నుంచి డిసెంబర్‌ 6 వరకు 1781 గంటల పాటు పంపింగ్‌చేసి 18.559 టిఎంసీల నీటిని ఎగువకు మళ్లించారు.

నవంబర్‌ 19 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించగా అప్పటి నుంచి 1,312 గంటలు పనిచేసి 13.675 టిఎంసీల నీటిని పంప్‌ చేశాయి. ఇందులో 5వ మిషన్‌ను అత్యధికంగా 295 గంటలు పనిచేయగా తద్వారా 3.080 టిఎంసీల నీటిని ఎత్తిపోయడం సాధ్యమైంది.

ఒక్కొక్క మిషన్‌ నుంచి గంటకు 0.01041 టిఎంసీల నీటిని పంప్‌చేయడం సాధ్యమవుతోంది. లింక్‌-1లో చివరిదైన పార్వతి పంపింగ్‌ కేంద్రం నుంచి ఇప్పటి దాకా 1639 గంటలు మిషన్లను పనిచేయించి 15.404 టిఎంసీల నీటిని శ్రీపాదసాగర్‌ ఎల్లంపల్లి జలాశయానికి చేర్చారు. ఇందులో 2వ యూనిట్‌ను 315 గంటల పాటు నడపగా 2.963 టిఎంసీల నీటిని అందించింది.

కాళేశ్వరానికి కీలకమైన గాయత్రి…..

అన్నింటికన్నా కీలకమైనది లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్‌హౌస్‌. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. అందులోనూ భూగర్భాన 430 అడుగుల దిగువన నిర్మించింది. ఇక్కడ 7 యూనిట్లు ఏర్పాటు చేయగా ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి.

ఇంత పెద్ద యూనిట్లు ఇంతవరకూ నీటి పారుదల రంగంలో ప్రపంచంలో ఎక్కడా వినియోగించలేదు. తొలిసారిగా తెలంగాణలో వినియోగంలోకి తేవడంలో ఎంఇఐఎల్‌తో పాటు బీహెచ్‌ఈఎల్‌ విశేష కృషి ప్రపంచ రికార్డుగా పరిగణించాలి. పైగా అనతికాలంలోనే వీటిని పూర్తిచేసి వినియోగంలోకి తేవడం మరో ప్రత్యేకత.

ఈ ఏడు మిషన్లు ఇప్పటిదాకా 2602 గంటల పాటు పనిచేయగా 29.70 టిఎంసీల నీటిని మిడ్‌మానేరు వైపు తరలించింది. సిరిసిల్లా సమీపంలోని మిడ్‌మానేరు జలాశయం తొలిసారిగా గోదావరి జలాలతో కళకళలాడుతోంది అంటే అందులో అన్ని పంప్‌హౌస్‌ల సామర్థ్యం ఉన్నప్పటికీ ఈ గాయత్రి పంపింగ్‌ కేంద్రానికి ప్రత్యేకత ఉంది.

ఒక్కొక్క మిషన్‌ నుంచి కనీసం 3,180 క్యూసెక్కుల నీటిని 170 అడుగుల ఎగువకు ఎత్తిపోస్తోంది. మన నీటి పారుదల రంగంలో ఎన్నో కాలువల సామర్థ్యం వెయ్యి క్యూసెక్కులు కూడా లేవు. తెలుగు గంగ, శ్రీశైలం ఎడమ-కుడి కాలువ, కేసి కాలువ, తుంగభద్ర ఎగువ కాలువ మొదలైనవాటితో పోలిస్తే ఈ పంపింగ్‌ సామర్థ్యం చాలా ఎక్కువ.

ఈ విధంగా నీటిని దిగువ నుంచి ఎగువకు పంపింగ్‌ చేయడంలో అంటే గోదావరి దశ-దిశను మార్చివేయడంలో మేఘా పాత్ర అమోఘమైనది. గోదావరికి మేఘా కొత్త నడకను నేర్పింది. నీరు పళ్ళమెరుగనే సామేతను తిరగ రాసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలకు తగిన విధంగా మేఘా ఇంజనీరింగ్‌ వ్యవస్థ గోదావరి తన నడకను మార్చుకుని దాదాపు 160 కిలోమీటర్ల ఎగువకు ప్రయాణించి అద్భుతాన్ని సుసాధ్యం చేసుకునే విధంగా మేఘా క్రియాశీల పాత్రను నిర్వహించింది.

ఈ ప్రాజెక్ట్‌లో లక్ష్మీ, సరస్వతి, పార్వతి, శ్రీపాదసాగర్‌, ఎల్లంపల్లి బ్యారేజ్, శ్రీరాంసాగర్‌ వరద కాలువ, మిడ్‌మానేరు జలాశయాల్లోకి నీరు చేరి నిలువ ఉండడంతో పాటు గోదావరి సాధారణంగా ఎండిపోయి ఇసుక కనపించే సమయంలో సైతం మేడిగడ్డ నుంచి సిరిసిల్లా వరకు నీటితో కళకళలాడడం వెనుక ఈ పంపింగ్‌ కేంద్రాల పనితీరు స్పష్టంగా కనిపిస్తోంది.

First Published:  16 Dec 2019 6:08 AM IST
Next Story