వర్మకు షాకిచ్చిన కేఏ పాల్... పోలీసుల నోటీసులు
అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాతో ఏపీ రాజకీయాలను షేక్ చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకిచ్చారు. ఈ సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. కమ్మరాజ్యం సినిమాలో తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఉపయోగించారని కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మకు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ […]
అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాతో ఏపీ రాజకీయాలను షేక్ చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకిచ్చారు. ఈ సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. కమ్మరాజ్యం సినిమాలో తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఉపయోగించారని కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మకు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పోలీసులు వర్మని ఆదేశించారు. వర్మ పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది.
కమ్మ రాజ్యం సినిమాలో మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ లను పోలిన పాత్రలతో వర్మ అవహేళన చేశారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేఏ పాల్ పై స్పెషల్ గా ఓ పాట తీసి కూడా వర్మ చిత్రీకరించి అవమానించారు. ఈ నేపథ్యంలో పాల్ హైకోర్టులో, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో రాంగోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. తాజాగా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయడంతో తప్పనిసరిగా పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలోనే వర్మను పోర్న్ సినిమా తీశాడని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు.