మెడాల్ స్కాంలో లోకేష్‌కు 250 కోట్లు ముడుపులు
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు రక్త పరీక్షలు చేసే కాంట్రాక్టును నిర్వహించిన మెడాల్ సంస్థ గత ప్రభుత్వంలో భారీగా ప్రజాధనాన్ని దోచుకుందని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. మెడాల్ స్కాంపై విచారణకు ఆదేశించాలని కోరారు. అపోలో ఆస్పత్రిలో 50 రూపాయలకు చేసే రక్త పరీక్షలకు కూడా మెడాల్ సంస్థ 230 రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకుందని గోపిరెడ్డి చెప్పారు. 75 రూపాయలతో చేసే హెచ్‌ఐవీ పరీక్ష మెడాల్ సంస్థ 230 రూపాయలు వసూలు […]
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు రక్త పరీక్షలు చేసే కాంట్రాక్టును నిర్వహించిన మెడాల్ సంస్థ గత ప్రభుత్వంలో భారీగా ప్రజాధనాన్ని దోచుకుందని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. మెడాల్ స్కాంపై విచారణకు ఆదేశించాలని కోరారు.
అపోలో ఆస్పత్రిలో 50 రూపాయలకు చేసే రక్త పరీక్షలకు కూడా మెడాల్ సంస్థ 230 రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకుందని గోపిరెడ్డి చెప్పారు. 75 రూపాయలతో చేసే హెచ్‌ఐవీ పరీక్ష మెడాల్ సంస్థ 230 రూపాయలు వసూలు చేసిందన్నారు.
ఇలా మెడాల్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం దోచి పెట్టిందన్నారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఈ మెడాల్ సంస్థ 45 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెడాల్ సంస్థ ఎన్ని కోట్లు దోచుకుందో తేల్చాలని కోరారు.
ఆస్పత్రుల్లో పరీక్షలకు అవసరమైన యంత్రాలను కోనుగోలు చేస్తే 120 కోట్లు అవుతుందని… కానీ మెడాల్ సంస్థ కేవలం పరీక్షలకే ఏడాదికి 120 కోట్లు తీసుకుందని గోపిరెడ్డి వివరించారు.
ఐదేళ్లలో ఈ విధంగా టీడీపీ ప్రభుత్వంలో వందల కోట్లు దోచేశారని.. మెడాల్ కుంభకోణంలో 250 కోట్ల రూపాయలు ముడుపులు నారా లోకేష్‌కు అందాయని… దీనిపై లోతుగా విచారణ జరిపించాలని కోరారు.