Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో స్టార్ వార్స్

సమరానికి టాప్ గన్స్ సిద్ధం 2020 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సీజన్ తొలి టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు ఆస్ట్ర్రేలియా వాణిజ్య రాజధాని మెల్బోర్న్ సకలహంగులతో ముస్తాబువుతోంది. జనవరిలో రెండువారాలపాటు సాగే 115వ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సమరం పురుషుల మహిళల విభాగాలలో ప్రపంచ మొదటి 50 మంది ర్యాంక్ ప్లేయర్లు పోటీ పడటానికి ఆమోదం తెలిపారు. మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ బార్టీ యాష్లీగా, పురుషుల సింగిల్స్ లో టాప్ స్టార్ రాఫెల్ నడాల్ టాప్ […]

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో స్టార్ వార్స్
X
  • సమరానికి టాప్ గన్స్ సిద్ధం

2020 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సీజన్ తొలి టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు ఆస్ట్ర్రేలియా వాణిజ్య రాజధాని మెల్బోర్న్ సకలహంగులతో ముస్తాబువుతోంది. జనవరిలో రెండువారాలపాటు సాగే 115వ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సమరం పురుషుల మహిళల విభాగాలలో ప్రపంచ మొదటి 50 మంది ర్యాంక్ ప్లేయర్లు పోటీ పడటానికి ఆమోదం తెలిపారు.

మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ బార్టీ యాష్లీగా, పురుషుల సింగిల్స్ లో టాప్ స్టార్ రాఫెల్ నడాల్ టాప్ సీడ్ ప్లేయర్లు గా టైటిల్ వేటకు దిగనున్నారు.

మెల్బోర్న్ పార్క్ లో జనవరి 20 నుంచి ఫిబ్రవరి 7 వరకూ జరిగే ఈ టోర్నీ పురుషుల ప్రారంభమ్యాచ్ లో డెల్ పోత్రో, మహిళల సింగిల్స్ ప్రారంభమ్యాచ్ ను ప్రపంచ మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఆడనున్నారు.

తన కెరియర్ లో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సెరెనా విలియమ్స్ కు ఈ టోర్నీ కీలకం కానుంది.
పురుషుల సింగిల్స్ లో నొవాక్ జోకోవిచ్, వావరింకా, ఎవర్ గ్రీన్ రోజర్ ఫెదరర్ల నుంచి టాప్ సీడ్ నడాల్ కు గట్టి పోటీ ఎదురుకానుంది.

సింగిల్స్ విజేతలకు 20 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. భారత మహిళల డబుల్స్ స్టార్ సానియా మీర్జా సైతం ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ద్వారానే రీ-ఎంట్రీకి సిద్ధమవుతోంది.

First Published:  15 Dec 2019 3:07 AM IST
Next Story