Telugu Global
National

అస్సాంలో బీజేపీకి షాక్... క్యాబ్‌ను వ్యతిరేకించిన మిత్రపక్షం

బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. అస్సాం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఇంటర్నెట్ సేవలు నిలిపి వేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అక్కడి ఆందోళనల వల్ల కేంద్ర హోం మంత్రి తన ఈశాన్య రాష్ట్రాల పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ఈ నేనథ్యంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. అస్సాంలో తన కూటమిలో భాగస్వామిగా ఉన్న అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) నుంచి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభలో తొలుత […]

అస్సాంలో బీజేపీకి షాక్... క్యాబ్‌ను వ్యతిరేకించిన మిత్రపక్షం
X

బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. అస్సాం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఇంటర్నెట్ సేవలు నిలిపి వేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అక్కడి ఆందోళనల వల్ల కేంద్ర హోం మంత్రి తన ఈశాన్య రాష్ట్రాల పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ఈ నేనథ్యంలో బీజేపీకి మరో షాక్ తగిలింది.

అస్సాంలో తన కూటమిలో భాగస్వామిగా ఉన్న అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) నుంచి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభలో తొలుత క్యాబ్‌కు మద్దతు ఇచ్చిన ఏజీపీ సడెన్‌గా యూటర్న్ తీసుకుంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాలను కూడా కలిసి తమ నిర్ణయాన్ని తెలపాలని అనుకుంటున్నారు. నిన్న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసీ ఏజీపీ నాయకులు వరుసగా రాజీనామాలు చేయడం ప్రారంభించారు. మరోవైపు అస్సాం బీజేపీ నాయకులు కూడా క్యాబ్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. బీజేపీ నాయకుడు జతిన్ బోరా కూడా తన పదవికి రాజీనామా చేశారు.

మరి ఇన్ని నిరసనల మధ్య క్యాబ్‌పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచిస్తుందో లేదో చూడాలి.

First Published:  15 Dec 2019 5:40 AM IST
Next Story