పీకే టీం... ఇక్కడేం చేస్తుందో!
ప్రశాంత్ కిషోర్ టీంకు ఇటీవల డిమాండ్ బాగానే పెరిగింది. ఏపీలో ఫలితాలు చూసిన తర్వాత పలు పార్టీలు ప్రశాంత్ కిషోర్‌ను పట్టుకుంటే పనైపోతుందన్న భావనలోకి వచ్చేశాయి. ఇప్పటికే తీవ్ర ఒత్తిడితో ఉన్న పార్టీలు పీకే కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ తరపున పీకే టీం పనిచేస్తోంది. తాజాగా ఢిల్లీలో ఆప్ తరపున రంగంలోకి దిగింది. పీకే టీంతో ఒప్పందం కుదిరినట్టు కేజ్రీవాల్ కూడా ప్రకటించారు. ఏపీలో జగన్‌మోహన్ రెడ్డి విజయం చూసిన తర్వాత వాస్తవ […]
ప్రశాంత్ కిషోర్ టీంకు ఇటీవల డిమాండ్ బాగానే పెరిగింది. ఏపీలో ఫలితాలు చూసిన తర్వాత పలు పార్టీలు ప్రశాంత్ కిషోర్‌ను పట్టుకుంటే పనైపోతుందన్న భావనలోకి వచ్చేశాయి. ఇప్పటికే తీవ్ర ఒత్తిడితో ఉన్న పార్టీలు పీకే కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటికే మమతా బెనర్జీ తరపున పీకే టీం పనిచేస్తోంది. తాజాగా ఢిల్లీలో ఆప్ తరపున రంగంలోకి దిగింది. పీకే టీంతో ఒప్పందం కుదిరినట్టు కేజ్రీవాల్ కూడా ప్రకటించారు.
ఏపీలో జగన్‌మోహన్ రెడ్డి విజయం చూసిన తర్వాత వాస్తవ పరిస్థితుల కంటే… పీకే దగ్గర ఏదో అద్భుత దీపం ఉందన్న భ్రమ పార్టీల్లో పెరిగింది. నిజానికి పీకే టీం పట్టిందల్లా బంగారం ఏమీ కాలేదు. కొన్ని రాష్ట్రాల్లో పీకే టీం పనిచేసిన పార్టీలు ఎన్నికల ఫలితాల్లో మట్టి కొట్టుకుపోయిన ఉదంతాలు ఉన్నాయి.
గెలిచిన చోట్ల ఆ పార్టీ పెద్దల కష్టం, ఆ పార్టీ శ్రేణుల శ్రమ కంటే… పీకే టీం తామే అంతా చేశామన్న ప్రచార ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అదే ఓడిన రాష్ట్రాల గురించి పెద్దగా ప్రచారం చేసుకోరు.
ఏపీలో కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సుధీర్ఘంగా పోరాటం, మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం,… వైసీపీ అభిమానులు స్వచ్చందంగా సోషల్ మీడియాలో, బయట యుద్ధం చేయడంతో ఆ గెలుపు సాధ్యమైంది. కానీ క్యాష్, క్రెడిట్ మాత్రం పీకే టీం బ్యాగులో పడింది.
Happy to share that @indianpac is coming on-board with us. Welcome aboard!
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2019
నిజానికి పీకే టీంలో కొమ్ములు తిరిగిన కురువృద్ధులేమీ పనిచేయరు. డిగ్రీ, బీటెక్ పిల్లలను తీసుకుని వారి చేత సోషల్ మీడియాలో హడావుడి చేయించడం, పార్టీ నేతల మీద నిఘా అనడం, నియోజకవర్గాల్లో కొన్ని టీంలను తిప్పి పరిస్థితిని రిపోర్టు చేయడం వంటివి మాత్రమే చేస్తుంటుంది. జాతీయ మీడియాలో కాస్త పాజిటివ్ ప్రచారం చేయించేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తుంటారు.
ప్రజల్లో ఆయా పార్టీలకు ఆదరణ లేకపోతే పీకే టీం దిగి కూడా ఏమీ చేయలేదు. అసలు పీకే టీం ఒక పార్టీ తరపున పనిచేయడానికి సిద్దపడే ముందే… ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందా? లేదా? అన్నది బేరీజు వేసుకునే బరిలో దిగుతుందని చెబుతుంటారు.
సదరు పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది, గెలుపు అంచుల్లో ఉందని తెలిసిన తర్వాతే ఆయా పార్టీలతో పీకే టీం ఒప్పందం చేసుకుంటుందన్న ప్రచారం కూడా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత పీకే టీం ఈ పంథాను ఫాలో అవుతోందని చెబుతుంటారు.
ఒడ్డుకు దగ్గరల్లో ఉన్న పార్టీని మాత్రమే పీకే టీం ఒడ్డుకు చేరుస్తుంది… ఒడ్డుకు దూరంగా కొట్టుకుపోతున్న పార్టీలను మాత్రం పీకే టీం కూడా ఒడ్డువైపు లాగలేదు అన్నది నిజం.
After Punjab results, we acknowledged you as the toughest opponent that we have ever faced. Happy to join forces now with @ArvindKejriwal and @AamAadmiParty. https://t.co/5Rcz4ie6Xs
— I-PAC (@IndianPAC) December 14, 2019