Telugu Global
NEWS

50వ పడిలో చదరంగ సామ్రాట్

నిత్యనూతనంగా విశ్వనాథన్ ఆనంద్ భారత, ప్రపంచ చెస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ 50వ పడిలో ప్రవేశించాడు. తల్లి ప్రేరణతో ఆరేళ్ల వయసులోనే చదరంగంలో ఓనమాలు దిద్దుకొన్న ఆనంద్ గత నాలుగుదశాబ్దాలుగా చెస్ లో తన జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు. తన కెరియర్ లో ఎన్నో అరుదైన విజయాలు, అసాధారణ ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆనంద్ కు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన అరుదైన రికార్డు ఉంది. ప్రపంచ చెస్ మూడుఫార్మాట్లలోనూ ప్రపంచ టైటిల్స్ నెగ్గిన మొనగాడు ఆనంద్ […]

50వ పడిలో చదరంగ సామ్రాట్
X
  • నిత్యనూతనంగా విశ్వనాథన్ ఆనంద్

భారత, ప్రపంచ చెస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ 50వ పడిలో ప్రవేశించాడు. తల్లి ప్రేరణతో ఆరేళ్ల వయసులోనే చదరంగంలో ఓనమాలు దిద్దుకొన్న ఆనంద్ గత నాలుగుదశాబ్దాలుగా చెస్ లో తన జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు.

తన కెరియర్ లో ఎన్నో అరుదైన విజయాలు, అసాధారణ ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆనంద్ కు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన అరుదైన రికార్డు ఉంది. ప్రపంచ చెస్ మూడుఫార్మాట్లలోనూ ప్రపంచ టైటిల్స్ నెగ్గిన మొనగాడు ఆనంద్ మాత్రమే.

భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న, పౌరపురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ లాంటి అవార్డులన్నీ అందుకొన్న ఆనంద్.. స్పెయిన్ అత్యున్నత పౌరపురస్కరాన్ని సైతం సాధించడం విశేషం.

కేవలం విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితోనే భారత చెస్ లో గ్రాండ్ మాస్టర్ల సంఖ్య 64కు పెరగడం విశేషం. ప్రపంచ చెస్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 15వ స్థానంలో ఉన్న ఆనంద్ తనకంటే ముందు తరాలవారితోనూ, తన తరం వారితోనూ, తన తర్వాతి తరాలవారితోనూ చెస్ ఆడుతూ తన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు ఎనలేని ఖ్యాతి సంపాదించి పెట్టిన ఆనంద్ 50వ పుట్టిన రోజు సందర్భంగా…ఆనంద్ విజయాలకు సంబంధించిన విశేషాలతో కూడిన మైండ్ మాస్టర్ అనే పుస్తకాన్ని సైతం వెలువరించారు.

First Published:  14 Dec 2019 6:57 AM IST
Next Story