విండీస్ తో రేపటినుంచే వన్డే సిరీస్
గాయంతో భువనేశ్వర్ కుమార్ అవుట్ వెస్టిండీస్ తో తీన్మార్ వన్డే సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే తొలి వన్డే సమరానికి ముందే భారతజట్టుకు గట్టి దెబ్బ తగిలింది. స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు మరోసారి గాయం కావడంతో సిరీస్ మొత్తాన్ని దూరమైనట్లు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. దీంతో భువీ స్థానంలో ముంబై ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కు చోటు కల్పించారు. 2018 ఆసియాకప్ టోర్నీలో చివరిసారిగా […]
- గాయంతో భువనేశ్వర్ కుమార్ అవుట్
వెస్టిండీస్ తో తీన్మార్ వన్డే సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే తొలి వన్డే సమరానికి ముందే భారతజట్టుకు గట్టి దెబ్బ తగిలింది.
స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు మరోసారి గాయం కావడంతో సిరీస్ మొత్తాన్ని దూరమైనట్లు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. దీంతో భువీ స్థానంలో ముంబై ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కు చోటు కల్పించారు.
2018 ఆసియాకప్ టోర్నీలో చివరిసారిగా భారత వన్డేజట్టులో సభ్యుడిగా పాల్గొన్న శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులో చేరగలిగాడు.
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు సైతం గాయం కావడంతో…ధావన్ స్థానంలో మయాంక్ అగర్వాల్ కు జట్టులో చోటు కల్పించినట్లు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.
ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ నాటినుంచి తరచూ గాయాలతో బాధపడుతున్న భువనేశ్వర్ కుమార్ ఫిట్ నెస్ భారత టీమ్ మేనేజ్ మెంట్ కు.. ప్రధాన సమస్యగా మారింది.
వెస్టిండీస్ తో ముగిసిన టీ-20 సిరీస్ ను 2-1తో నెగ్గిన భారత్…మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో సైతం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
సిరీస్ లోని తొలివన్డే డిసెంబర్ 15న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతుంది. డిసెంబర్ 18న జరిగే రెండో వన్డేకి విశాఖపట్నం, డిసెంబర్ 22న జరిగే ఆఖరి వన్డేకి కటక్ బారాబటీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నాయి.