మోడీ దేశాన్ని దోచి అంబానీ, అదానీలకు పంచుతున్నారు...
దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన ‘భారత్ బచావో’ ర్యాలీలో ప్రసంగించిన సోనియా … దేశం తగలబడుతుంటే మోడీ, అమిత్ షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలబడిపోతున్నా…. మోడీ- షాలకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. రాజ్యాంగాన్ని కావాల్సిన విధంగా మార్చుతూ దుర్వినియోగం చేస్తున్నారని… ఇష్టమొచ్చినట్టుగా ఆర్టికల్స్‌ను ప్రయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో ధరలు పెరిగి […]
దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన ‘భారత్ బచావో’ ర్యాలీలో ప్రసంగించిన సోనియా … దేశం తగలబడుతుంటే మోడీ, అమిత్ షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలబడిపోతున్నా…. మోడీ- షాలకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. రాజ్యాంగాన్ని కావాల్సిన విధంగా మార్చుతూ దుర్వినియోగం చేస్తున్నారని… ఇష్టమొచ్చినట్టుగా ఆర్టికల్స్‌ను ప్రయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు.
దేశంలో ధరలు పెరిగి జనం అల్లాడిపోతున్నారని ఆందోళన చెందారు. మోడీ-షాల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోయి యువత ఉద్యోగాలు లేక, రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని … ‘సబ్ కా సాత్… సబ్ కా వికాస్’ హామీ ఏమైందని సోనియా ప్రశ్నించారు.
ఇదే ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ… తాను సత్యాలు మాట్లాడుతానని.. అందుకు ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనన్నారు. ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నానన్నారు. ఏదో ఒక రోజు దేశానికి మోడీ, అమిత్ షాలు క్షమాపణ చెప్పాల్సిన సమయం వస్తుందన్నారు.
మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల దేశం నష్టపోయిందన్నారు. పేదలను దోచి అంబానీ, అదానీలకు మోడీ పెడుతున్నారని ఆరోపించారు. ఆ రెండు సంస్థలకు మోడీ 25పెద్ద కాంట్రాక్టులు ఇచ్చారన్నారు.
‘’జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. నేడు జీడీపీ వృద్ధి 4 శాతంగా ఉంది. అది కూడా బీజేపీ తన పద్ధతిలో జీడీపీని అంచనా వేసినపుడు. గతంలోలాగా ఇప్పుడు కూడా జీడీపీని చూస్తే.. అది ప్రస్తుతం 2.5 శాతానికి దిగజారుతుంది. మతాల మధ్య చిచ్చుపెట్టి జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రేఖలు సృష్టించారు. అసోం, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి చూడండి. మోదీ ఆ రాష్ట్రాలను నిరసన జ్వాలల్లో తగలబెట్టారు’’ అని రాహుల్ ఫైర్ అయ్యారు.
టీవీల్లో 30 సెకన్ల పాటు ప్రకటన ఇవ్వాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని… అలాంటిది మోడీ ప్రకటనలు రోజూ టీవీల్లో కనిపిస్తున్నాయని… వాటికి చెల్లిస్తున్న డబ్బు ప్రజాధనం కాదా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.