Telugu Global
NEWS

టీ-20 ర్యాంకింగ్స్ లో కొహ్లీ అప్, రోహిత్ డౌన్‌

6వ ర్యాంకులో కెఎల్ రాహుల్ వెస్టిండీస్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ తర్వాత భారత స్టార్ ప్లేయర్ల ర్యాంకింగ్స్ లో కుదుపు వచ్చింది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్ లో ఓ స్థానం దిగజారితే…మరో ఓపెనర్ కెఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కొహ్లీ పుంజుకోగలిగారు. ముంబై టీ-20లో ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ గా నిలిచిన యువఓపెనర్ రాహుల్ మూడుస్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని… ఆరో ర్యాంక్ కు చేరుకోగలిగాడు. మరోవైపు ప్లేయర్ ఆఫ్ […]

టీ-20 ర్యాంకింగ్స్ లో కొహ్లీ అప్, రోహిత్ డౌన్‌
X
  • 6వ ర్యాంకులో కెఎల్ రాహుల్

వెస్టిండీస్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ తర్వాత భారత స్టార్ ప్లేయర్ల ర్యాంకింగ్స్ లో కుదుపు వచ్చింది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్ లో ఓ స్థానం దిగజారితే…మరో ఓపెనర్ కెఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కొహ్లీ పుంజుకోగలిగారు.

ముంబై టీ-20లో ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ గా నిలిచిన యువఓపెనర్ రాహుల్ మూడుస్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని… ఆరో ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

మరోవైపు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన విరాట్ కొహ్లీ ఏకంగా ఐదుస్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని తొలిసారిగా టాప్-10 ర్యాంకుల్లో చోటు సంపాదించాడు.

ఇప్పటి వరకూ 8వ ర్యాంక్ లో కొనసాగుతూ వచ్చిన రోహిత్ శర్మ…విండీస్ తో సిరీస్ తర్వాత 9వ ర్యాంక్ కు పడిపోయాడు.
2019 టీ-20 సీజన్లో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ చెరో 2633 పరుగుల చొప్పున సాధించి సమఉజ్జీలుగా నిలిచారు. కొహ్లీ 24 హాప్ సెంచరీలు నమోదు చేస్తే.. రోహిత్ 19 హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించగలిగాడు.

కొహ్లీ 75 మ్యాచ్ లు…70 ఇన్నింగ్స్ లోనే 2వేల 633 పరుగులు సాధిస్తే…రోహిత్ శర్మ మాత్రం 104 మ్యాచ్ లు, 96 ఇన్నింగ్స్ లో 2వేల 633 పరుగులు నమోదు చేయడం విశేషం.

ప్రపంచకప్ కు సన్నాహకంగా జరిగే తర్వాతి టీ-20 సిరీస్ ల్లో శ్రీలంక, ఆస్ట్ర్రేలియా జట్లతో భారత్ తలపడనుంది.

First Published:  13 Dec 2019 5:56 AM IST
Next Story