Telugu Global
NEWS

జగన్‌ను కలిసిన ఆనం... నెల్లూరు పంచాయితీ ముగిసిందా?

నెల్లూరులో మాఫియా రాజ్యం ఏలుతుందని బాంబు పేల్చిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ఎట్టకేలకు సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లారు. నెల్లూరు జిల్లా ఇంచార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆనం నారాయణరెడ్డిని జగన్‌ దగ్గరకు తీసుకెళ్లారు. నెల్లూరు రాజకీయాలపై చర్చించారు. ఇకపై ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే డైరెక్టుగా తన దగ్గరికి తీసుకురావాలని జగన్‌ ఆనంకు సూచించారు. మీడియాలో చర్చకు పెట్టవద్దని సూచించారు. పార్టీలో క్రమశిక్షణ తప్పేలా ఉండవద్దని అన్నారు. అయితే ఆనం తన వ్యాఖ్యలపై […]

జగన్‌ను కలిసిన ఆనం... నెల్లూరు పంచాయితీ ముగిసిందా?
X

నెల్లూరులో మాఫియా రాజ్యం ఏలుతుందని బాంబు పేల్చిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ఎట్టకేలకు సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లారు. నెల్లూరు జిల్లా ఇంచార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆనం నారాయణరెడ్డిని జగన్‌ దగ్గరకు తీసుకెళ్లారు. నెల్లూరు రాజకీయాలపై చర్చించారు.

ఇకపై ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే డైరెక్టుగా తన దగ్గరికి తీసుకురావాలని జగన్‌ ఆనంకు సూచించారు. మీడియాలో చర్చకు పెట్టవద్దని సూచించారు. పార్టీలో క్రమశిక్షణ తప్పేలా ఉండవద్దని అన్నారు.

అయితే ఆనం తన వ్యాఖ్యలపై సీఎంకు వివరించారు. తన కామెంట్స్‌ వెనుక ఉద్దేశ్యాన్ని వివరించారు. గత కొద్ది రోజులుగా అసెంబ్లీలో తన సీనియార్టీతో అవసరమైన సందర్భాల్లో పార్టీకి దన్నుగా నిలిచిన తీరును ఆనం సీఎం దృష్టికి తీసుకువెళ్లారట.

అయితే నెల్లూరు జిల్లాలో ఆనం కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. గ్రూపు రాజకీయాలను బయటపెట్టింది. ఆనం కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఒకనొక దశలో షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని అనుకుంది.

అయితే జిల్లా మంత్రి బాలినేనితో పాటు ఇతర కీలక నేతలు వద్దని చెప్పారట. తాము ఇష్యూని పరిష్కరిస్తామని చెప్పారట. ఇందులో భాగంగ సీఎం జగన్‌ దగ్గరకు ఈ విషయాన్ని తీసుకెళ్లి… ఆనంకు సర్థిచెప్పారట. మొత్తానికి నెల్లూరు పంచాయతీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

First Published:  13 Dec 2019 2:21 AM IST
Next Story