Telugu Global
NEWS

జగన్‌ నిర్ణయంపై చిరంజీవి ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న ‘ఏపి దిశ-2019’ చట్టం పట్ల మాజీ కేంద్ర మంత్రి, హీరో చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. వేధింపులకు గురవుతున్న మహిళలకు, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ఈ చట్టం రక్షణ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. దిశ ఘటనలో భావోద్వేగాలు… తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయని.. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ఆ […]

జగన్‌ నిర్ణయంపై చిరంజీవి ప్రశంసలు
X

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న ‘ఏపి దిశ-2019’ చట్టం పట్ల మాజీ కేంద్ర మంత్రి, హీరో చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. వేధింపులకు గురవుతున్న మహిళలకు, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ఈ చట్టం రక్షణ ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

దిశ ఘటనలో భావోద్వేగాలు… తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయని.. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ఆ దిశగా సత్వర న్యాయం కోసం ఏపీ ప్రభుత్వం తొలి అడుగు వేయడం హర్షనీయమన్నారు.

మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటి నేరాల్లో విచారణకు 4నెలలు అంతకంటే ఎక్కువ సమయం పడుతోందని… ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 21 రోజుల్లోనే ఆ పక్రియ ముగించేలా ప్రత్యేక కోర్టులు, ఇతర సదుపాయలు కల్పించడాన్ని తాను అభినందిస్తున్నట్టు చెప్పారు.

సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని శిక్షించేలా చట్టం తేవడం కూడా మంచి పరిణామమన్నారు. దీని వల్ల మహిళలను కించపరచాలన్న ఆలోచన ఉన్న వారిలో భయం కలుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను మనస్పూర్తిగా అభినిందిస్తున్నట్టు చిరంజీవి చెప్పారు.

First Published:  12 Dec 2019 7:20 AM IST
Next Story