Telugu Global
NEWS

చంద్రబాబు 45 ఏళ్ల పీహెచ్‌డీపై చర్చ

ప్రభుత్వం ఏమిచేసినా తప్పుపట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. పేదవాళ్లు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న అంశంపై చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో రెండు మీడియాలు ఉండాలని చెప్పే చంద్రబాబు… సీఎంగా ఉండగానే నారాయణ ప్రైవేట్ స్కూళ్లలో పూర్తి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారని జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే.. సాక్షి పత్రికలో వ్యతిరేకిస్తూ కథనాలు రాశారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. నిజంగా మంచి చేయాలని […]

చంద్రబాబు 45 ఏళ్ల పీహెచ్‌డీపై చర్చ
X

ప్రభుత్వం ఏమిచేసినా తప్పుపట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. పేదవాళ్లు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న అంశంపై చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందన్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో రెండు మీడియాలు ఉండాలని చెప్పే చంద్రబాబు… సీఎంగా ఉండగానే నారాయణ ప్రైవేట్ స్కూళ్లలో పూర్తి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారని జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే.. సాక్షి పత్రికలో వ్యతిరేకిస్తూ కథనాలు రాశారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. నిజంగా మంచి చేయాలని చంద్రబాబు అనుకుని ఉంటే… సాక్షి రాసినా, ఎవరు అడ్డుపడినా ముందుకెళ్లి ఉండేవారన్నారు సీఎం.

తనకు ఇంగ్లీష్ రాదు అంటూ హేళన చేస్తున్నారని… తాను చేసిన అభివృద్ధిని చూసిన తర్వాతే బిల్ గేట్‌, టోని బ్లెయిర్‌, బిల్ క్లింటన్‌ లాంటి వారు ముందుకొచ్చారని చంద్రబాబు చెప్పారు. తాను ఎంఏ చాలా రోజుల క్రితమే పాస్ అయ్యానని చంద్రబాబు వివరించారు. ఏం చదివారో కూడా తెలియని వ్యక్తులకు తనను విమర్శించే హక్కు లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఎస్వీ వర్శిటీలోనే ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేశానన్నారు. మూడేళ్లలోనే పీహెచ్‌డీ పూర్తి చేశానని చెవిరెడ్డి వివరించారు. 1972లో చంద్రబాబు పీహెచ్‌డీలో చేరారని… ఇప్పటికీ పీహెచ్‌డీ చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. 1972లో ఎంపిల్‌ చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని… కానీ 1972లో ఎస్వీవర్శిటీలో ఎంపిల్‌ లేనే లేదని… 1980లో ఎంపిల్ వచ్చిందని చెవిరెడ్డి వివరించారు.

First Published:  11 Dec 2019 6:07 AM IST
Next Story