స్పీకర్‌ను అంతుచూస్తానన్న చంద్రబాబు... భగ్గుమన్న అసెంబ్లీ
ఇంగ్లీష్ మీడియంపై మాట్లాడేందుకు తనకు మైక్ ఇవ్వలేదన్న కోపంతో స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైఖరి మార్చుకోకుంటే మర్యాదగా ఉండదు… అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు హెచ్చరించారు. దాంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌పై ఇష్టానుసారం మాట్లాడవద్దని హెచ్చరించారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని స్పీకర్ హెచ్చరించారు. స్పీకర్‌కు కూడా మర్యాద ఇవ్వలేని స్థితికి వెళ్లిపోతున్నారని… ఇది బాధాకరమని తమ్మినేని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడిగా గౌరవం ఉందని.. దాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు […]
ఇంగ్లీష్ మీడియంపై మాట్లాడేందుకు తనకు మైక్ ఇవ్వలేదన్న కోపంతో స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైఖరి మార్చుకోకుంటే మర్యాదగా ఉండదు… అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు హెచ్చరించారు. దాంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌పై ఇష్టానుసారం మాట్లాడవద్దని హెచ్చరించారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని స్పీకర్ హెచ్చరించారు.
స్పీకర్‌కు కూడా మర్యాద ఇవ్వలేని స్థితికి వెళ్లిపోతున్నారని… ఇది బాధాకరమని తమ్మినేని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడిగా గౌరవం ఉందని.. దాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా అంతే స్థాయిలో స్పీకర్‌పై గట్టిగా అరిచారు. టీడీపీ సభ్యులు పోడియంను చుట్టు ముట్టారు.
స్పీకర్‌ను అనకూడని మాటలు అని… పైగా స్పీకర్‌కే సవాళ్లు విసురుతున్న ప్రతిపక్షనాయకుడిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు అయినా సరే… సభా మర్యాదను పాడు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకున్న తర్వాతే సభను నిర్వహించాలని అంబటి వాదించారు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోకుంటే అది అసెంబ్లీకే అవమానకరమన్నారు. నిన్నటి నుంచి కూడా చంద్రబాబు ఇదే తరహాలో సభను, స్పీకర్‌ను బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారని…. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనన్నారు.
స్పీకర్‌ను ఉద్దేశించి ”నీ అంతు చూస్తా… నీవెవరు అక్కడ కూర్చుని మాట్లాడడానికి” అంటూ హెచ్చరించిన చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జోగి రమేష్ కోరారు.
40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నుంచి తాను ఏమి నేర్చుకోవాలో అర్థం కావడం లేదన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేందుకు అవకాశం ఇస్తుంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నుంచి ఏం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.