Telugu Global
Cinema & Entertainment

వెంకీమామకు లైన్ క్లియర్

మొన్నటివరకు రిలీజ్ డేట్ కోసం కిందామీద పడిన వెంకీమామ సినిమాకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. 13వ తేదీన రాబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాత్రి సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. 149 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. మరోవైపు సినిమా రిలీజ్ డేట్ పై ఎందుకంత సస్పెన్స్ నడిచిందనే విషయంపై సురేష్ బాబు […]

వెంకీమామకు లైన్ క్లియర్
X

మొన్నటివరకు రిలీజ్ డేట్ కోసం కిందామీద పడిన వెంకీమామ సినిమాకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. 13వ తేదీన రాబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాత్రి సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. 149 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

మరోవైపు సినిమా రిలీజ్ డేట్ పై ఎందుకంత సస్పెన్స్ నడిచిందనే విషయంపై సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఆఖరి షెడ్యూల్ లో వెంకటేష్ మోకాలికి గాయం అవ్వడంతో షూటింగ్ లేట్ అయిందని, ఆ తర్వాత వెంకటేష్ కోలుకున్నప్పటికీ రాశిఖన్నా కాల్షీట్లు దొరక్కపోవడంతో షూటింగ్ జరగలేదని స్పష్టంచేశాడు. ఈ రెండు కారణాల వల్ల రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం తలెత్తిందని తెలిపాడు.

వీటితో పాటు తన జీవితంలో అనుకోని సంఘటనలు చాలా జరిగాయని, ఓ 2 నెలల పాటు తను అమెరికా వెళ్లాల్సి వచ్చిందని తెలిపిన సురేష్ బాబు.. సంక్రాంతికి వెంకీమామను రిలీజ్ చేస్తామంటూ గతంలో వచ్చిన వార్తల్ని ఖండించాడు. తమకు అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదని, క్రిస్మస్ కు రావాలని అనుకున్నప్పటికీ, అంతకంటే ముందే వస్తే బెటరని డిసెంబర్ 13ను ఫిక్స్ చేశామన్నారు సురేష్ బాబు.

First Published:  9 Dec 2019 11:45 PM
Next Story