రష్యా ఒలింపిక్స్ సంఘానికి భారీదెబ్బ
2020 ఒలింపిక్స్ లో పాల్గొనకుండా నిషేధం ప్రపంచ క్రీడారంగంలో అతిపెద్ద శక్తుల్లో ఒకటైన రష్యాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వచ్చే నాలుగు సంవత్సరాలపాటు ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొనకుండా.. రష్యా ఒలింపిక్ సంఘంపైన అంతర్జాతీయ డోపింగ్ సంస్థ వాడా నిషేధం విధించింది. రష్యా అథ్లెట్లు, క్రీడాకారులు నిషేధిత ఉత్ర్పేరకాలు ఉపయోగిస్తూ అడ్డదారిలో పతకాలు సాధించేలా రష్యా ఒలింపిక్ సంఘం, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లుగా వాడా గుర్తించింది. రష్యాలోని డోపింగ్ నిరోధక సంస్థలు తప్పుడు సమాచారంతో క్రీడాకారులు మాదకద్రవ్యాలు ఉపయోగించేలా ప్రోత్సహించడాన్ని వాడా […]
- 2020 ఒలింపిక్స్ లో పాల్గొనకుండా నిషేధం
ప్రపంచ క్రీడారంగంలో అతిపెద్ద శక్తుల్లో ఒకటైన రష్యాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వచ్చే నాలుగు సంవత్సరాలపాటు ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొనకుండా.. రష్యా ఒలింపిక్ సంఘంపైన అంతర్జాతీయ డోపింగ్ సంస్థ వాడా నిషేధం విధించింది.
రష్యా అథ్లెట్లు, క్రీడాకారులు నిషేధిత ఉత్ర్పేరకాలు ఉపయోగిస్తూ అడ్డదారిలో పతకాలు సాధించేలా రష్యా ఒలింపిక్ సంఘం, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లుగా వాడా గుర్తించింది. రష్యాలోని డోపింగ్ నిరోధక సంస్థలు తప్పుడు సమాచారంతో క్రీడాకారులు మాదకద్రవ్యాలు ఉపయోగించేలా ప్రోత్సహించడాన్ని వాడా తీవ్రంగా పరిగణించింది.
టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ తో పాటు..వింటర్ ఒలింపిక్స్ లో సైతం రష్యా అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు..ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో రష్యా పాల్గొనటం పై ఏ విధమైన నిషేధం లేదని తేల్చి చెప్పింది.
ఇప్పటి వరకూ వివిధ దేశాల అథ్లెట్లు మాత్రమే డోప్ పరీక్షల్లో విఫలమవుతూ నిషేధానికి గురవుతూ వస్తున్నారు. ఏకంగా ఓ దేశ ఒలింపిక్ సంఘమే నిషేధం వేటుకు గురికావడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
రియో వేదికగా ముగిసిన గత ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలు సాధించిన మొదటి పది దేశాలలో ఒకటిగా ఉన్న రష్యా లేకుండానే 2020 ఒలింపిక్స్ జరుగనున్నాయి.