రంజీ క్రికెట్ మ్యాచ్ లో పాము కలకలం
విజయవాడ గ్రౌండ్లోకి చొరబడిన సర్పం ఆంధ్ర- విదర్భ మ్యాచ్ కు అంతరాయం జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి కుక్కలు, కాకులు, సీగల్స్ లాంటి సముద్రపు జాతి పక్షులు, పావురాలు చొరబడటం అందరికీ తెలిసిందే. అయితే…2019-20 రంజీ సీజన్లో భాగంగా…విజయవాడలోని గోకరాజు గంగరాజు లైలా స్టేడియం వేదికగా ఆంధ్ర- విదర్భ జట్ల మ్యాచ్ తొలిరోజు ఆట ప్రారంభంలోనే…అనుకోని అతిథిలా ఓ సర్పం పిచ్ మీదకు జరజరాపాకుకుంటూ వచ్చింది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ విదర్బ […]
- విజయవాడ గ్రౌండ్లోకి చొరబడిన సర్పం
- ఆంధ్ర- విదర్భ మ్యాచ్ కు అంతరాయం
జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి కుక్కలు, కాకులు, సీగల్స్ లాంటి సముద్రపు జాతి పక్షులు, పావురాలు చొరబడటం అందరికీ తెలిసిందే.
అయితే…2019-20 రంజీ సీజన్లో భాగంగా…విజయవాడలోని గోకరాజు గంగరాజు లైలా స్టేడియం వేదికగా ఆంధ్ర- విదర్భ జట్ల మ్యాచ్ తొలిరోజు ఆట ప్రారంభంలోనే…అనుకోని అతిథిలా ఓ సర్పం పిచ్ మీదకు జరజరాపాకుకుంటూ వచ్చింది.
ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ విదర్బ టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. అయితే ..ఆంధ్ర ఓపెనర్లు క్రీజులోకి రావటానికి ముందే.. ఓపాము పిచ్ మీదకు పాకుకొంటూ రావటాన్ని చూసిన విదర్భ వికెట్ కీపర్ బిత్తరపోయాడు.
అంపైర్లు సైతం పాము ను చూసి ఆప్రమత్తం కావడంతో… గ్రౌండ్ సిబ్బంది వచ్చి కేకలు, సంజ్ఞలు చేస్తూ ఆ సర్పం సురక్షితంగా బయటకు వెళ్లేలా చేశారు.
గ్రౌండ్లోని ఆటగాళ్లు మాత్రమే కాదు…పాపం…ఆ సర్పం సైతం బతుకు జీవుడా అంటూ ప్రాణభయంతో పిచ్ మీద నుంచి వేగంగా పాకుకుంటూ బయటకు వెళ్లిపోయింది.
అనుకోని అతిథిలా వచ్చిన ఆ నాగరాజు గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లేవరకూ అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేయక తప్పలేదు.
భారత క్రికెట్ చరిత్రలో ఓ క్రికెట్ మ్యాచ్…పాము రాకతో కొద్ది నిముషాలపాటు నిలిచిపోడం ఇదే మొదటిసారి.
అన్నట్లు…విదర్భ క్రికెట్ సంఘం చిహ్నం సైతం పామే కావడం విశేషం. విదర్భ క్రికెటర్ల షర్టులపై పాము బొమ్మను చూసి ఈ నాగరాజు పలుకరించడానికా అన్నట్లు గ్రౌండ్లోకి వచ్చిందేమో మరి.