Telugu Global
NEWS

ఇంతగా ఎందుకు దిగజారిపోయావ్ బాబు? ఉల్లి 25కే ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే...

ఉల్లి ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. దేశం మొత్తం మీద ఒక ఏపీ మాత్రమే 25 రూపాయలకు ఉల్లిని సబ్సిడీ మీద ప్రజలకు అందిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. తక్కువ ధరకు ఉల్లిని అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు. ప్రతి రైతు బజారులోనూ కేజీ 25 రూపాయలకే అమ్ముతున్నామని వివరించారు. 36వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి 25 రూపాయలకు అమ్ముతున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని వెల్లడించారు. స్థానికంగా స్టాక్ లేకపోవడంతో […]

ఇంతగా ఎందుకు దిగజారిపోయావ్ బాబు? ఉల్లి 25కే ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే...
X

ఉల్లి ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. దేశం మొత్తం మీద ఒక ఏపీ మాత్రమే 25 రూపాయలకు ఉల్లిని సబ్సిడీ మీద ప్రజలకు అందిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. తక్కువ ధరకు ఉల్లిని అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు.

ప్రతి రైతు బజారులోనూ కేజీ 25 రూపాయలకే అమ్ముతున్నామని వివరించారు. 36వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి 25 రూపాయలకు అమ్ముతున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని వెల్లడించారు.

స్థానికంగా స్టాక్ లేకపోవడంతో సోలాపూర్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఉల్లి గిట్టుబాటు కాక రైతులు పొలాల్లోనే ఉల్లిని వదిలేసిన పరిస్థితి ఉండేదన్నారు.

ఇప్పుడు ప్రభుత్వ జోక్యం కారణంగా రైతులకు మంచి ధర దక్కడంతో పాటు… ప్రజలకు 25 రూపాయలకే ఉల్లి అందుతోందన్నారు. దేశంలోనే అతి తక్కువ ధరకు ఉల్లిని అందిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు.

చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కేజీ ఉల్లిని 200లకు అమ్ముతున్నారని… ఈయన ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏమిటని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు ఇంతగా దిగజారిపోయి… న్యాయం, ధర్మం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళల భద్రత కోసం కఠిన చట్టాలు తీసుకొచ్చే అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధపడుతుంటే ప్రతిపక్షం అడ్డుపడడం దారుణమన్నారు.

First Published:  9 Dec 2019 1:24 AM GMT
Next Story