Telugu Global
NEWS

రెండో టీ-20లో భారత్ బోల్తా

8 వికెట్లతో విండీస్ అలవోక విజయం 1-1తో సమఉజ్జీలుగా భారత్, విండీస్ భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. హైదరాబాద్ లో ముగిసిన తొలి టీ-20లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గితే… తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ-20లోవిండీస్ మరో 9 బాల్స్ మిగిలిఉండగానే భారత్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి… 1-1తో సమఉజ్జీగా నిలువగలిగింది. సిరీస్ కే కీలకంగా మారిన ఈ మ్యాచ్ […]

రెండో టీ-20లో భారత్ బోల్తా
X
  • 8 వికెట్లతో విండీస్ అలవోక విజయం
  • 1-1తో సమఉజ్జీలుగా భారత్, విండీస్

భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. హైదరాబాద్ లో ముగిసిన తొలి టీ-20లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గితే… తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ-20లోవిండీస్ మరో 9 బాల్స్ మిగిలిఉండగానే భారత్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి… 1-1తో సమఉజ్జీగా నిలువగలిగింది.

సిరీస్ కే కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ 15, రాహుల్ 11, కెప్టెన్ విరాట్ కొహ్లీ 19 పరుగుల స్కోర్లకే అవుట్ కాగా…యువఆటగాడు శివం దూబే ధూమ్ ధామ్ హాఫ్ సెంచరీతో తనజట్టును ఆదుకొన్నాడు.

శివం దూబే కేవలం 30 బాల్స్ లోనే 3 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేయడం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో విలియమ్స్, వాల్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

లెండిల్ సిమ్మన్స్ షో…

20 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన విండీస్ కు ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, ఇవిన్ లూయిస్ హాఫ్ సెంచరీతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

యువహిట్టర్లు హెట్ మేయర్, నికోలస్ పూరన్ దూకుడుగా…లెండిల్స్ సిమ్మన్స్ స్ట్ర్రోక్ ఫుల్ అజేయ హాఫ్ సెంచరీతో..మరో 9 బాల్స్ మిగిలిఉండగానే.. కరీబియన్ టీమ్ 8 వికెట్ల విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది.

విండీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ సిమ్మన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టీ-20 మ్యాచ్.. ముంబై వేదికగా డిసెంబర్ 11న జరుగుతుంది.

ప్రస్తుత రెండోటీ-20తో సహా రెండుజట్లూ ఇప్పటి వరకూ 15సార్లు తలపడితే…భారత్ 9 విజయాలు, విండీస్ 6 విజయాల రికార్డుతో ఉన్నాయి.

First Published:  9 Dec 2019 2:48 AM IST
Next Story