భారత్ కు పతకాల వెల్లువ
పోటీల ఏడోరోజునా బంగారు పంట దక్షిణాసియా దేశాల క్రీడల ఏడోరోజు పోటీలలో సైతం భారత అథ్లెట్ల ఆధిపత్యం కొనసాగింది. కుస్తీ, ఈత అంశాలలో అత్యధిక బంగారు పతకాలు సాధించారు. పోటీల ఏడోరోజున భారత్ ఖాతాలో 22 స్వర్ణాలతో సహా మొత్తం 38 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో…10 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆదివారం పోటీలు ముగిసే సమయానికి భారత్ మొత్తం 252 పతకాలతో …పతకాల పట్టిక అగ్రస్థానంలో సగర్వంగా నిలిచింది. ఇప్పటి వరకూ భారత అథ్లెట్లు […]
- పోటీల ఏడోరోజునా బంగారు పంట
దక్షిణాసియా దేశాల క్రీడల ఏడోరోజు పోటీలలో సైతం భారత అథ్లెట్ల ఆధిపత్యం కొనసాగింది. కుస్తీ, ఈత అంశాలలో అత్యధిక బంగారు పతకాలు సాధించారు.
పోటీల ఏడోరోజున భారత్ ఖాతాలో 22 స్వర్ణాలతో సహా మొత్తం 38 పతకాలు వచ్చి చేరాయి.
ఇందులో…10 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆదివారం పోటీలు ముగిసే సమయానికి భారత్ మొత్తం 252 పతకాలతో …పతకాల పట్టిక అగ్రస్థానంలో సగర్వంగా నిలిచింది.
ఇప్పటి వరకూ భారత అథ్లెట్లు 132 బంగారు, 79 రజత, 41 కాంస్య పతకాలు సాధించారు. ఆతిథ్య నేపాల్ 45 స్వర్ణాలతో సహా మొత్తం 165 పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టిక రెండోస్థానంలో కొనసాగుతోంది.
శ్రీలంక 36 బంగారు పతకాలతో సహా మొత్తం 197 పతకాలతో మూడోస్థానంలో నిలిచింది.
హ్యాండ్ బాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్ అంశాలలో సైతం భారత అథ్లెట్లు అత్యధిక బంగారు పతకాలు సాధించగలిగారు. మరికొద్ది గంటల్లో ముగిసే 2019 శాఫ్ గేమ్స్ లో భారత్ ఓవరాల్ చాంపియన్ గా తన సంపూర్ణ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోడం కేవలం లాంఛనం మాత్రమే.